
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన కొంత మంది మహిళలు మహిళా సంఘం ఆధ్వర్యంలో స్నేహితులకు గాజులు వేసుకునే కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ప్రతి రోజు కలిసే స్నేహితులు స్థానికంగా ఉండే మహిళలను పిలిచి వారందూ ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. అయితే ఇదే ప్రాంతానికి చెందిన కోంపల్లి అనిత అనే మహిళను ఈ కార్యక్రమానికి పిలవడం మిగతా స్నేహితులు మర్చిపోయారు. దీంతో తీవ్ర అసంతృప్తికి చెందిన అనిత తనను ఎందుకు పిలువలేదో చెప్పాలని కోర్టును అశ్రాయించారు. ఆమె పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్ట్ ప్రతివాదులకు నోటీసులు కూడా జారి చేసింది.
తాను మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉన్నానని, గత కొన్నీ సంవత్సరాల నుండి ఇక్కడే నివసిస్తున్నానని.. కానీ సంఘం వాళ్లు మాత్రం గాజుల పండగ కార్యక్రమానికి తనను పిలవలేదని ఆమె పేర్కొంది. తనను ఎందుకు పిలవలేదో, తనను పిలవకపోవటానికి కారణం ఏంటో సంఘ సభ్యులు చెప్పాల్సిందిగా నోటిసులు పంపింఛానని కోర్టును కోరింది. దీంతో కోర్టు సంఘ సభ్యులు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు చూసిన సంఘం సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అయితే సంఘం సభ్యుల వాదన మరోలా ఉంది. స్నేహితులందరం కలిసి గాజుల పండగ చేసుకున్నామని, ఈ కార్యక్రమానికి అనితను పిలిచినా.. పిలవలేదని నోటీసులు పంపించడం ఏంటని వారు అంటున్నారు. ఏదైనా సమస్య ఉంటే గ్రామంలో పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలి కాని.. ఇలా నోటీసులు పంపించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.