విధి రాతను ఎవరూ తప్పించుకోలేరు.. చోరికి వచ్చి విగతజీవిగా మారిన తండ్రీకొడుకులు..!

| Edited By: Balaraju Goud

Sep 11, 2024 | 7:17 PM

మహబూబ్ నగర్ జిల్లాలో చోరీ యత్నం ఏకంగా తండ్రీకొడుకుల ప్రాణాలనే బలిగొంది. అర్ధరాత్రి వేళ ఓ సోలార్ విద్యుత్ ప్లాంట్‌లో చోరీ చేయడానికి వచ్చిన దుండగులు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌‌కు గురై అక్కడికక్కడే మృతి చెందడం కలకలం రేపింది.

విధి రాతను ఎవరూ తప్పించుకోలేరు.. చోరికి వచ్చి విగతజీవిగా మారిన తండ్రీకొడుకులు..!
Electric Shock
Follow us on

మహబూబ్ నగర్ జిల్లాలో చోరీ యత్నం ఏకంగా తండ్రీకొడుకుల ప్రాణాలనే బలిగొంది. అర్ధరాత్రి వేళ ఓ సోలార్ విద్యుత్ ప్లాంట్‌లో చోరీ చేయడానికి వచ్చిన దుండగులు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌‌కు గురై అక్కడికక్కడే మృతి చెందడం కలకలం రేపింది.

మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లి గ్రామ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఊరు శివారులోని ప్రగతి సోలార్ ప్లాంట్‌లో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి ప్రయత్నించారు. అందులో విద్యుత్ కేబుల్ వైర్లను చోరీ చేయడానికి వచ్చి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు దొంగలు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం పోలీసులకు తెలియడంతో ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇటీవల సోలార్ ప్లాంటులో పలుమార్లు విద్యుత్ కేబుల్స్ చోరీకి గురి కావడంతో సోలార్ సంస్థ నిర్వాహకులు చుట్టూ రెండంచెల కంచె ఏర్పాటు చేశారు. అందులో రెండో అంచెలో ప్రత్యేకంగా విద్యుత్ సప్లై‌తో కంచె ఏర్పాటు చేశారు. ఇది గమనించని దుండగులు గత రాత్రి(సెప్టెంబర్ 10, మంగళవారం) ఔటర్ ఫెన్సింగ్ ని కట్ చేసి ఇన్నర్ ఫెన్సింగ్ లో ఉన్నా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ని పట్టుకోగా షాక్ తగిలి అక్కడికి అక్కడే మరణించారు. ఘటనా స్థలంలో వైర్ కట్టర్లు, ఒక టవల్ లోపల రాళ్లు, గోనెసంచులు లభించాయి. వీరూ రాగి తీగ దొంగలించే ఉద్దేశంతో నే ఫెన్సింగ్ కట్ చేసి సోలార్ ప్లాంట్ లోపలికి వచ్చినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతులు ఇద్దరు జోగుళాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాలకు చెందిన తండ్రి కొడుకులు బాలస్వామి(42), జయరాజ్(17)గా గుర్తించారు. మృతదేహాలను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి పాల్పడానికి వచ్చిన వ్యక్తులు ఈ ఇద్దరేనా లేక మరికొంతమంది ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. గ్రామస్థుల తెలిపిన వివరాల ప్రకారం బోలెరో వాహనంలో సుమారు 8మంది వచ్చినట్లు చెబుతున్నారు. అందులో ఒక మహిళా సైతం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..