Telangana: సాయంత్రం వేళ ఇంటి పక్కనుంచి శబ్ధాలు.. ఏంటా అని వెళ్లి చూడగా..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం. అప్పటివరకు ఉక్కపోత, వేడితో అల్లాడిపోయారు ప్రజలు. సాయంకాలం అవుతుండగా వాతావరణంలో మార్పు కనపించింది. మేఘాలు ముసిరాయి. ఈ సయయంలో స్థానికంగా ఉన్న ఖాళీ స్థలం నుంచి శబ్దాలు వినిపించాయి. ఏంటా అని వారు పరుగు పరుగున బయటకు వచ్చి చూడగా....

Telangana: సాయంత్రం వేళ ఇంటి పక్కనుంచి శబ్ధాలు.. ఏంటా అని వెళ్లి చూడగా..
Representative Image

Edited By: Ram Naramaneni

Updated on: Apr 26, 2025 | 3:17 PM

రెండు పాములు కలిసి సందడి చేశాయి. దాదాపు గంటసేపు పైగానే సయ్యాటలాడాయి. పాములు ఒకదానికి ఒకటి మెల వేసుకునే దృశ్యం అందరిని ఆశ్చర్యపరిచాయి.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఈ సీన్ కనిపించింది. ఆ దశ్యాలను స్థానికులు మొబైల్ ఫోన్లలో బంధించారు. చాలా వరకు మనిషి అలజడి వస్తే.. అక్కడి నుంచి పాములు మరోచోటుకు వెళ్లిపోతాయి. కానీ సయ్యాటలో ఉన్న పాములు మనుషులు అక్కడ మాట్లాడుకుంటున్నా పట్టించుకోకుండా తమ పనిలో నిమగ్నమయ్యాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం సత్యనారాయణపురం టీచర్స్ కాలనీలో… సాయంత్రం వేళ స్థానికులు నివాసాల దగ్గరలో ఒక్కసారిగా శబ్దాలు వినిపించాయి. ఏమి జరుగుతుందో అర్థం కాక చుట్టు పక్కాల ఇళ్ల వాళ్లు బయటకు వచ్చి చూసి.. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.. రెండు పాముల కదలికలు చూసి తొలుత స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.  కానీ పరిశీలించిగా అవి సయ్యాటలో ఉన్నట్లు అర్థం చేసుకున్నారు. రెండు పాములు సయ్యాట దృశ్యాన్ని ఆసక్తిగా చూశారు. గంటపాటు సయ్యాట తర్వాత పాములు అక్కడ నుంచి సమీప చెట్లలోకి వెళ్లిపోయాయి.. గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న సత్యనారాయణపురంలో ఈ ఘటన జరిగింది.

ప్రస్తుతం పాములకు మేటింగ్ సీజన్ అని.. అందుకే  పాముల సంభోగంకు చెందిన వీడియోలు ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు.

వీడియో దిగువన చూడండి…