Warangal Road Accident: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన బైక్ కల్వర్టును ఢీ కొనడంతో.. ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన దేశాయిపేట- పైడిపల్లి ప్రధాన రహదారిపై ఆదివారం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..
ఇదిలాఉంటే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. మండలంలోని గాంధీనగరం చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి లారీ ఓ వ్యక్తిని ఢీకొట్టింది. రాజు అనేవ్యక్తిని లారీ ఢీకొట్టగా అతను అక్కడికక్కడే మరణించాడు. అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాల పాలైన రాజు ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..