Warangal: ప్రాణాలు తీసిన వర్షం.. భవనం కూలి ఇద్దరు దుర్మరణం.. గాఢ నిద్రలో ఉండగా..

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు తిప్పారపు పైడి (60) అనే వృద్ధుడు, ఫిరోజ్ (20) గా గుర్తించారు.

Warangal: ప్రాణాలు తీసిన వర్షం.. భవనం కూలి ఇద్దరు దుర్మరణం.. గాఢ నిద్రలో ఉండగా..
Building Collapsed

Updated on: Jul 23, 2022 | 6:50 AM

Building collapsed in Warangal: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు వరంగల్‌లో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని మండీబజార్‌లో అర్ధరాత్రి పురాతన భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళకు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు తిప్పారపు పైడి (60) అనే వృద్ధుడు, ఫిరోజ్ (20) గా గుర్తించారు. కాగా.. మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

ఘటన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ ఘటనతో మండీబజార్‌లో విషాదం నెలకొంది.

ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..