MLC election observers : శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు నామినేషన్లు పూర్తి అయ్యాయి. పోలింగ్ ఏర్పాట్లను ముమ్మరం చేసింది ఎన్నికల సంఘం. ఈనేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందిగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇద్దరు పరిశీలకులను నియమించింది. ఎన్నికల పరిశీలకులుగా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు.
మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గానికి ఎంసీహెచ్‌ఆర్డీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ హరిప్రీత్‌సింగ్, వరంగల్- ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గానికి యువజన సాంస్కృతికశాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నియమిస్తన్నట్లు సీఈవో తెలిపారు. వీరు వెంటనే ఎన్నికల పరిశీలకులుగా విధులను నిర్వర్తిస్తారన్నారు. మరోవైపు రెండు సెంగ్మెట్లలో మైక్రో అబ్జర్వర్స్ కూడా విధులు నిర్వహిస్తారని తెలిపారు.