తెలంగాణ దంగల్ చివరి చరణంలోకి ప్రవేశించింది. మరి కొద్ది రోజుల్లో ప్రచారానికి ఫుల్ స్టాప్ పడునుంది. మైకులు మూగబోనున్నాయి. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వాట్ తెలంగాణ థింక్స్ టుడే…తెలంగాణ ఏం ఆలోచిస్తోంది? ఎవరికి పట్టం కట్టాలనుకుంటోంది? జనం మదిలో ఏముంది? తెలంగాణ దంగల్ – 2023 కాంక్లేవ్‌లో నేతల మదిలో మెదులుతున్న ఆలోచనలను టీవీ9 వెలికి తీసింది. తెలంగాణపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎవరి విజన్ ఏంటి? ఎన్నికల్లో విజయం సాధిస్తే..గెలిచాక ఎవరు ఏం చేయనున్నారు…అంటే సూటిగా స్పష్టంగా తమ విజన్‌ను జనం ముందు ఉంచుతున్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క.
విజన్ అంటే రేపు ఏం చేస్తామో చెప్పడం కాదు…ఓ 20 ఏళ్ల తర్వాత తెలంగాణ ఎలా ఉండాలో…ఎక్కడ ఉండాలో చెప్పడం అంటున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. దేశంలో అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన ఇన్ ఫ్రా సాధించిన రాష్ట్రం తెలంగాణ అంటూ….టీవీ9 నిర్వహించిన కాంక్లేవ్‌లో ఆయన చెప్పారు. తన తెలంగాణ విజన్‌లో మూడు గోల్స్ పెట్టుకున్నారు కేటీఆర్.
ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సంపదను పెంచుతాం, ప్రజలకు పంచుతాం అంటున్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. అభివృద్ధి చేస్తూనే.. సంపదను పెంచి.. ప్రజలకు సంక్షేమాన్ని అందించడమే కాంగ్రెస్ విజన్ అంటున్నారు భట్టి. మరి ఈ ఇద్దరి నేతల విజన్‌లో ఎవరి విజన్‌కు తెలంగాణకు జై కొడుతుందో…డిసెంబర్ 3న తేలనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..