తెలంగాణ దంగల్‌లో అందరి ఫోకస్ నవంబర్ 30పైనే ఉంది. మూడు ప్రధాన పార్టీల గుండెల్లో దడ పెరుగుతోంది. అటు..తెలంగాణ ఓటరు మదిలో కూడా గందరగోళమే. ఈ హై పొలిటికల్ హీట్ వేవ్‌లో హిస్టారికల్ ఎలక్టోరల్ ఎక్స్‌పరిమెంట్ నిర్వహించింది టీవీ9. ఎవరి ఊహకందని రీతిలో టీవీ9 మెగా పొలిటికల్ కాన్‌క్లేవ్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది. తెలంగాణ రాజకీయాల్లో అతిరథ మహారధులందరూ ఒకేచోట కొలువుదీరి..పొలిటికల్ ట్రెండ్‌పై తమతమ అమూల్యమైన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఓటెవరికి అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్న జనానికి ఓరల్ సపోర్ట్‌గా నిలబడింది టీవీ9.
టీవీ9 మారథాన్ డిబేట్ ఉదయం 10 గంటలకు ప్రారంభమై..రాత్రి 10 గంటల వరకూ కొనసాగింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నేతలు కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, మల్లారెడ్డి, బీజేపీ జాతీయనేత ప్రకాశ్ జవదేకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మురళీధర్‌రావు, కాంగ్రెస్ నేతలు భట్టివిక్రమార్క, జగ్గారెడ్డి ఉన్నారు. వీరితోపాటు సీపీఐ నారాయణ, మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ, పొన్నాల లక్ష్మయ్య లాంటి పొలిటికల్సే కాదు..సామాజిక రాజకీయాల్ని ప్రభావితం చేసే ఆర్.క్రిష్ణయ్య, మందక్రిష్ణ మాదిగ వంటి నేతలు టీవీ9 కాంక్లేవ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. సీనియర్ జర్నలిస్టులు, పొలిటికల్ ఎనలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయా పార్టీల నేతలు తమ అమూల్యమైన అభిప్రాయాలను వెల్లడించారు.
తెలంగాణలోని ప్రధాన పార్టీల అగ్రనేతల విమర్శలు, ప్రతి విమర్శలతో TV9 కాన్‌క్లేవ్ హాట్‌హాట్‌గా కొనసాగింది. ఉదయం 10 గంటలకు మంత్రి కేటీఆర్‌తో మొదలైన కాన్‌క్లేవ్ రాత్రివరకూ కంటిన్యూగా కొనసాగింది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు పోటియే లేదన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్‌కు 20 సీట్లు మించి రావన్నారు. కేసీఆర్ సీఎంగా ఉండాలనేదే తమ కోరికన్నారు. ఆ తర్వాత మారథాన్ డిబేట్‌లో సీఎల్పీనేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని విమర్శించారాయన. సీఎం పదవికోసం కాంగ్రెస్‌లో ఎవరూ పోటీపడటం లేదన్నారు భట్టి. అందరి ఏకాభిప్రాయంతోనే సీఎం అభ్యర్ధిని నిర్ణయిస్తామన్నారు.
బీసీనీ సీఎం చేయాలన్నదే బీజేపీ విధానమన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. తాను పోటీలో ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అందుకే తనకు పోటీ చేసే అవకాశం రాలేదన్నారు. లిక్కర్, భూములు అమ్మకపోతే, సంక్షేమ పథకాలు అమలు చేయని పరిస్థితి తెలంగాణలో ఉందని విమర్శించారు కిషన్‌రెడ్డి. అటు త్రిపుల్ తలాక్‌తో ముస్లిం మహిళల్లో తమ పార్టీకి మద్దతు ఉందన్నారు ప్రకాశ్ జవదేకర్. ముస్లింలపై బీజేపీకి ఎలాంటి ద్వేషం లేదన్నారు. ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లు ఇస్తున్నామని, యూపీలో కూడా ఇచ్చామన్నారు. మోదీ నినాదం సబ్‌కా సాత్..సబ్‌కా వికాస్ అన్నారు జవదేకర్.
హిందూవులకి వ్యతిరేకంగా తాము ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. తెలంగాణలో తొమ్మిదిన్నరేళ్లలో ఒక్కసారి కూడా అల్లర్లు జరగలేదన్నారు. కేసీఆర్ పాలనలో ఎంతో అభివృద్ది జరిగిందని..శాంతి భద్రతలు మెరుపడ్డాయన్నారు. ఆ తర్వాత అటు మంత్రులు హరీష్‌రావు, మల్లారెడ్డి కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమన్నారు హరీష్‌రావు. మీటర్లు పెడతామని కాంగ్రెస్, బీజేపీ చెబుతున్నాయని, మీటర్ పెట్టాక బిల్లు కట్టమని మెడమీద కత్తిపెడతారన్నారు. రైతుకు ఉచితవిద్యుత్తు ఇస్తామని BRS భరోసా ఇస్తోందన్నారు హరీష్‌రావు. కాంగ్రెస్..క్రమశిక్షణ లేని పార్టీ అన్నారు మంత్రి మల్లారెడ్డి. 28 రాష్ట్రాల్లో తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపారని, దేశానికి తెలంగాణ మోడల్‌గా నిలిచిందన్నారు మల్లారెడ్డి.
వీరితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీపీఐ నారాయణ, బీజేపీ మురళీధర్‌రావు, పొన్నాల లక్ష్మయ్య మారథాన్ డిబేట్‌లో పాల్గొన్నారు. కాన్‌క్లేవ్‌లో పాల్గొన్ని కార్యక్రమాన్ని సక్సెస్‌ఫుల్ చేసిన నేతలకు టీవీ9 మేనేజింగ్ డైరెక్టర్ రజినీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి టోటల్‌గా ఈ ఎలక్షన్ టైమ్‌లో తెలంగాణ సమాజం ఏం ఆలోచిస్తోందో తేల్చే ప్రయత్నం చేసింది టీవీ9. తెలుగు మీడియా చరిత్రలో ఇదొక రేరెస్ట్ ఫీట్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..