TV9 Rajinikanth: టీవీ9 రజినీకాంత్‌కు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డు అందజేసిన న్యూజెర్సీ అసెంబ్లీ

|

Jul 08, 2022 | 8:17 AM

అమెరికాలోని న్యూజెర్సీ అసెంబ్లీ తరుపున సెనేటర్ జ్వికర్.. ప్రవాసుల సమక్షంలో రజనీకాంత్‌కు సత్కారం చేసి.. పురస్కారాన్ని అందజేశారు.

TV9 Rajinikanth: టీవీ9 రజినీకాంత్‌కు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డు అందజేసిన న్యూజెర్సీ అసెంబ్లీ
Tv9 Rajinikanth
Follow us on

TV9 Managing Editor Rajinikanth: టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌కు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. జర్నలిజంలో ఆయన చేసిన సేవలను గుర్తించిన న్యూజెర్సీ స్టేట్ అసెంబ్లీ ఆయనకు ప్రతిష్టాత్మక అవార్డును అందజేసింది. న్యూజెర్సీ అసెంబ్లీ తీర్మానంతో సత్కారం అందుకున్న మొదటి ఇండియన్ జర్నలిస్ట్‌గా వెల్లలచెరువు రజనీకాంత్ అరుదైన గౌరవం పొందారు. శుక్రవారం అమెరికాలోని న్యూజెర్సీ అసెంబ్లీ తరుపున సెనేటర్ జ్వికర్.. ప్రవాసుల సమక్షంలో రజనీకాంత్‌కు సత్కారం చేసి.. పురస్కారాన్ని అందజేశారు. గార్డెన్ స్టేట్‌లో జరిగిన సాయి దత్త పీఠం వేడుకలో ఈ పురస్కారాన్ని రజనీకాంత్ అందకున్నారు. గౌరవప్రదమైన అవార్డును రజనీకాంత్‌కు అందించడం పట్ల న్యూజెర్సీ రాష్ట్ర సెనేట్, జెనెటల్ అసెంబ్లీ సంతోషం వ్యక్తంచేశాయి.

TV9 న్యూస్ మేనేజింగ్ ఎడిటర్‌గా రజనీకాంత్.. జర్నలిజంలో అందించిన అసాధారణ విజయాలు, సమాజ సేవలను ప్రముఖులు ప్రశంసించారు. రజనీకాంత్ TV9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో టీవీ9 తెలుగు ద్వారా సంచలనాత్మక చర్చలు, సామాజిక అంశాలపై విశ్లేషాణాత్మక డిబేట్లు, ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా, ప్రభుత్వాలకు చేరేలా ప్రయత్నిస్తున్నారు. రజనీకాంత్‌ నిర్వహిస్తున్న బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ ద్వారా గత పదిహేనేళ్లకు పైగా రాజకీయ ప్రముఖులు, అతిథులతో ముఖ్యమైన అంశాలపై చర్చలు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..