TSRTC: ప్రయాణికుల నడ్డి విరుస్తోన్న ఆర్టీసీ.. సెస్ పేరుతో మరో సారి వడ్డన

|

Mar 28, 2022 | 10:36 AM

ఛార్జీల పెంపుదలలో తెలంగాణ ఆర్టీసీ (TSRTC) దూసుకుపోతోంది. ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు లేకుండా పరుగులు పెడుతోంది. ప్యాసింజర్‌ సెస్‌ పేరుతో ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో రూ.5 చొప్పున, సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో...

TSRTC: ప్రయాణికుల నడ్డి విరుస్తోన్న ఆర్టీసీ.. సెస్ పేరుతో మరో సారి వడ్డన
Tsrtc
Follow us on

ఛార్జీల పెంపుదలలో తెలంగాణ ఆర్టీసీ (TSRTC) దూసుకుపోతోంది. ప్రగతి రథ చక్రాలకు బ్రేకులు లేకుండా పరుగులు పెడుతోంది. ప్యాసింజర్‌ సెస్‌ పేరుతో ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో రూ.5 చొప్పున, సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 వరకు టికెట్‌ రేట్లను(Ticket prices) పెంచింది. ఈ ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆర్టీసీ వెల్లడించింది. అకస్మాత్తుగా ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వస్తువుల ధరలు పెంచేస్తే సామాన్యులు ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే రౌండప్‌ విధానాన్ని తీసుకొచ్చిన ఆర్టీసీ.. పల్లెవెలుగు బస్సు టికెట్‌ ధరల్లో దాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. చిల్లర సమస్య కారణంగా టికెట్‌ రేట్లను రౌండప్‌ చేసింది.

మరోవైపు.. హైదరాబాద్ సిటీ బస్సుల్లో బస్‌పాస్‌ ఛార్జీలను పెంచుతూ గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ ధరలు (Charges) ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. జనరల్‌ బస్‌ టికెట్‌ పాసుల కేటగిరిలో ఆర్డినరీ పాస్‌ (Ordinary Pass) చార్జీ రూ.950 నుంచి రూ.1150కి, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.1,070 నుంచి రూ.1,300కు, మెట్రో డీలక్స్‌ రూ.1,185 నుంచి రూ.1,450కి, మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్‌ రూ.575 నుంచి రూ.700కు, ఎంఎంటీఎస్‌–ఆర్టీసీ కోంబో టికెట్‌ ఛార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెరిగింది.

Also Read

Accident: పెను విషాదం.. ఆర్టీసీ-బస్సు కారు ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Markets: నష్టాలతో వారం ప్రారంభం.. నెగెటివ్‌లో ట్రేడ్ అవుతున్న సూచీలు..

Viral Video: ఏయ్.. నన్నే ఫోటో దింపుతావా?.. పిల్లి దెబ్బకు అబ్బా అన్నా ఫోటోగ్రాఫర్.. ఫన్నీ వీడియో మీకోసం..