TSRTC: రామయ్య భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఆ గడువను పొడగిస్తూ నిర్ణయం

|

Apr 19, 2024 | 1:23 PM

కాగా భద్రాచలంలో భక్తులు అందించే తలంబ్రాలు ఎంతో ప్రత్యేకమైనవి. కేవలం ఈ తలంబ్రాలను స్వీకరించేందుకే ప్రజలు పెద్ద ఎత్తున భద్రాచలం వస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే భద్రాచలం వెళ్లలేని వారు కూడా ఇంటి వద్దకే తలంబ్రాలను తెప్పించుకునేందుకు వీలుగా తెలంగాణ ఆర్టీసీ అవకాశం కల్పిస్తుందన్న విషయం తెలిసిందే. ప్రతీ ఏటా ఆర్టీసీ...

TSRTC: రామయ్య భక్తులకు గుడ్‌ న్యూస్‌.. ఆ గడువను పొడగిస్తూ నిర్ణయం
Bhadrachalam
Follow us on

శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అయోధ్య మొదలు భద్రాద్రి వరకు అన్ని దేవాలయాల్లో రాములోరి కళ్యాణం చూడముచ్చటగా జరిగింది. ఇక భద్రాచంలో జరిగిన సీతారామచంద్రుల కళ్యాణోత్సవానికి ఎక్కడెక్కడి నుంచే భక్తులు పెద్ద ఎత్తున విచ్చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ వేడుకను కనులారా చూసేందుకు భద్రాచాలం వచ్చారు.

కాగా భద్రాచలంలో భక్తులు అందించే తలంబ్రాలు ఎంతో ప్రత్యేకమైనవి. కేవలం ఈ తలంబ్రాలను స్వీకరించేందుకే ప్రజలు పెద్ద ఎత్తున భద్రాచలం వస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే భద్రాచలం వెళ్లలేని వారు కూడా ఇంటి వద్దకే తలంబ్రాలను తెప్పించుకునేందుకు వీలుగా తెలంగాణ ఆర్టీసీ అవకాశం కల్పిస్తుందన్న విషయం తెలిసిందే. ప్రతీ ఏటా ఆర్టీసీ కార్గో సేవల ద్వారా తలంబ్రాలను పొందేందుకు వీలు కల్పించారు.

ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ విధానంలో తలంబ్రాలను బుకింగ్ గడువు ముగియగా తాజాగా అధికారులు ఈ గడువును పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఈ విషయమై సజ్జనార్‌ ట్వీట్ చేస్తూ.. ‘శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువును #TSRTC పొడిగించింది. ఈ నెల 25 తేదీ వరకు బుకింగ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది’ అని తెలిపారు.

ఇక రూ.151లకే విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలు పొందే సదావకాశాన్ని వినియోగించుకోవాలని భక్తులను సంస్థ కోరుతోందని అని ట్వీట్ చేశారు. టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగ వెబ్సైట్ http://tsrtclogistics.in ను సందర్శించి తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించగలరని రాసుకొచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..