Road Accident: హైదరాబాద్‌లో తృటిలో తప్పిన భారీ ప్రమాదం.. ఒక్క క్షణం దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్న ప్రయాణికులు..

Road Accident: హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో భారీ ప్రమాదం తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా వ్వవహరించడంతో

Road Accident: హైదరాబాద్‌లో తృటిలో తప్పిన భారీ ప్రమాదం.. ఒక్క క్షణం దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్న ప్రయాణికులు..

Updated on: Feb 09, 2021 | 9:27 PM

Road Accident: హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో భారీ ప్రమాదం తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా వ్వవహరించడంతో 40 మందికిపైగా ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు వివరాల్లోకెళితే.. మెహిదీపట్నం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే 49M బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దాంతో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పింది. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై.. మెట్రో పిల్లర్ల మధ్య వేసిన డివైడర్‌పైకి పోనిచ్చాడు. దాంతో బస్సు ముందు భాగం డివైడర్ పైకి ఎక్కేసింది.

ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులు సహా ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క క్షణం అంతా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నారు. డ్రైవర్ గనక అప్రమత్తంగా లేకుంటే పెను ప్రమాదం సంబంధించేదే అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బస్సులోని ప్రయానికులుంతా కిందకు దిగి వేరు వేరు వాహనాల్లో వెళ్లిపోయారు. కాగా, ప్రమాద స్థలిని ఆర్టీసీ అధికారులు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మరోవైపు బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Bar Code Scanner: మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఈ యాప్‌ ఉందా..? అయితే వెంటనే డిలీట్‌ చేయండి… ఎందుకో తెలుసా..?

Karthika Deepam : అచ్చతెలుగు ఆడబడుచుగా ఆదరణ సొంతం చేసుకున్న కార్తీక దీపం అత్త సౌదర్య.. బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే!..