TSRJC CET 2023 Exam Date: మే 6న తెలంగాణ గురుకుల జూనియర్‌ ప్రవేశ పరీక్ష.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..

తెలంగాణ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ఇంటర్ ఫప్ట్‌ ఇయర్‌ ప్రవేశాల కోసం టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష-2023..

TSRJC CET 2023 Exam Date: మే 6న తెలంగాణ గురుకుల జూనియర్‌ ప్రవేశ పరీక్ష.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..
TSRJC CET 2023

Updated on: Mar 21, 2023 | 8:06 PM

తెలంగాణ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ఇంటర్ ఫప్ట్‌ ఇయర్‌ ప్రవేశాల కోసం టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష-2023 మే 6న నిర్వహిస్తున్నట్లు గురుకుల సొసైటీ సెక్రటరీ రమణకుమార్‌ మార్చి 20 (సోమవారం) ఓ ప్రకటనలో తెలిపారు. మే 6వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాల వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు మార్చి 31లోపు అధికారిక వెబ్‌సైట్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని 35 జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.