టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్ వ్యవహారం వెలుగులోకి మరిన్ని సంచలనాలు వస్తున్నాయి. ప్రవీణ్ వ్యవహారంపై మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రూఫ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ మాజీ అధికారులు, ఇతర అభ్యర్థులు ఇదే సందేహాలను లేవనెత్తుతున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చాయి. అయితే, ప్రవీణ్‌కు అన్ని మార్కులు రావడం అంత ఈజీ కాదంటున్నారు మాజీ అధికారులు. సెక్రటరీ పీఏ గా ఉంటూ రోజు ఆఫీసు పనులు చేసుకునే ప్రవీణ్‌కు 103 మార్కుల రావడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల నుంచి గ్రూప్స్ చదువుతున్న అభ్యర్థులు కూడా స్కోర్ చేయని మార్కులు ప్రవీణ్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సెక్రటరీ పీఏ లేదా ఇతర ఉద్యోగులు గ్రూప్స్ రాయలంటే ఖచ్చితంగా 2నెలలు సెలవు పెట్టాలని అంటున్నారు. కానీ, ప్రవీణ్ ఏమాత్రం సెలవు పెట్టకుండానే గ్రూప్స్ రాయడం అందరి అనుమానాలకు బలం చేకూరుస్తుంది.
అయితే, గ్రూప్స్ రాసే ఉద్యోగులను ఎగ్జామ్స్ డ్యూటీ నుంచి తప్పించాల్సిన బాధ్యత కమీషన్‌దే అని అంటున్నారు మాజీ అధికారులు. టీఎస్‌పీఎస్‌సీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పేపర్ లీక్స్ జరిగాయని అంటున్నారు.
కాగా, సెక్రటరీ డైరీ నుంచి యూజర్ నేమ్ పాస్‌వర్డ్ చోరీ చేసి ప్రవీణ్ పేపర్ లీక్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కమీషన్ చైర్మన్, సెక్రటరీకి ప్రశ్నపత్రాల యాక్సెస్ ఉంటుంది. సెక్రటరీ పీఏగా ఉంటూ ప్రశ్నప్రతాలను లీక్ చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రవీణ్ ఇంకెంత మందికి ప్రశ్నపత్రాలు లీక్ చేశాడనే దానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..