TSPSC Group 4 Exam
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1న గ్రూప్ 4 పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జూన్ 24 నుంచి హాల్‌టికెట్లు కూడా అందుబాటులో ఉంచారు. భారీసంఖ్యలో అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్-4 పరీక్ష ప్రారంభానికి రెండు సెషన్లలో 15 నిమిషాల ముందు గేట్లు మూసివేయనున్నారు. అంటే ఉదయం జరిగే పేపర్-1కు 9.45 గంటలు, మధ్యాహ్నం జరిగే పేపర్-2కు 2.15 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. ఉదయం జరిగే పేపర్ 1కు ఉదయం 8 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం జరిగే పేపర్-2కు 1 గంట నుంచి అభ్యర్థులను అనుమతిస్తారు. పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. పేపర్ 2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.
ముఖ్యమైన సూచనలు ఇవే..
- నామినల్ రోల్‌లో సంతకం చేశాక, ఎడమచేతి బొటన వేలిముద్ర తీసుకుని పరీక్ష హాల్‌లోకి ప్రవేశం కల్పిస్తారు. ప్రతి సెషన్ పరీక్ష ముగిసిన అనంతరం ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు అందజేసిన తర్వాత మళ్లీ వేలిముద్ర వేయాలి.
- ప్రతి అరగంటకోసారి అభ్యర్థులకు సమయాన్ని గుర్తుచేస్తూ బెల్ మోగిస్తారు. పరీక్ష ముగిసే సమయానికి 5 నిమిషాల ముందు చివరిసారిగా హెచ్చిరిక బెల్ మోగిస్తారు.
- అభ్యర్ధులెవరూ ప్రశ్నపత్రంపై సమాధానాలు మార్క్ చేయకూడదని కమిషన్ స్పష్టం చేసింది.
- ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్‌తో కూడిన కారు తాళాలు, ఇతర వస్తువులేవీ లోపలికి అనుమతి ఉండదు. చెప్పులు మాత్రమే ధరించాలి. షూ వేసుకున్నవారిని అనుమతించారు.
- ఓఎంఆర్ పత్రంలో బ్లూ లేదా బ్లాక్ పెన్‌తో పేరు, పరీక్ష కేంద్రం కోడ్, హాల్‌టికెట్, ప్రశ్నపత్రం నంబరు రాయాలని కమిషన్ తెలిపింది.
- హాల్‌టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌కాకుండా ఇంక్‌పెన్, జెల్‌పెన్, పెన్సిల్ ఉపయోగించినా సదరు ఓఎంఆర్ పత్రం చెల్లుబాటుకాదని స్పష్టం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.