TSPSC: టీఎస్‌పీఎస్‌సీ సంచలన నిర్ణయం.. గ్రూప్-1 ప్రిలిమ్స్ సహా మరో రెండు పరీక్షలు రద్దు..

|

Mar 17, 2023 | 2:53 PM

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష సహా మరో రెండు పరీక్షలను రద్దు చేసింది.

TSPSC: టీఎస్‌పీఎస్‌సీ సంచలన నిర్ణయం.. గ్రూప్-1 ప్రిలిమ్స్ సహా మరో రెండు పరీక్షలు రద్దు..
Tspsc Group 1
Follow us on

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష సహా మరో రెండు పరీక్షలను రద్దు చేసింది. అలాగే.. త్వరలో జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్సీ నుంచి ఎగ్జామ్ పేపర్స్ లీక్ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దాంతో టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకకుంది.

ఇప్పటికే జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేయడంతో పాటు.. త్వరలో జరుగనున్న జూనియర్ లెక్చరర్ల పరీక్షలు వాయిదా వేసింది. నిందితుడు ప్రవీణ్ పెన్ డ్రైవ్‌లో వేర్వేరు ప్రశ్నాపత్రాలను గుర్తించారు దర్యాప్తు అధికారులు. కాగా, ప్రవీణ్.. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ నుంచి నాలుగు ఎగ్జామ్ పేపర్లను కాపీ చేసుకున్నట్లు గుర్తించారు. రానున్న 3, 4 నెలల్లో 20కి పైగా టీఎస్‌పీఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ తరుణంలో పేపర్లు లీక్ అవడంతో.. అన్ని ప్రశ్న పత్రాలను మార్చాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలకు ఉపక్రమించింది.

గ్రూప్ -1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజ్‌ను బట్టబయలు చేసిన టీవీ9..

ఎగ్జామ్ పేపర్ లీకేజీ వ్యవహారంలో మొత్తం మూడు పరీక్షలను రద్దు చేసింది టీఎస్‌పీఎస్సీ. గ్రూప్ – 1 ప్రిలిమ్స్, AEE, DAO పరీక్షలు రద్దు చేసింది. జూన్ 11న తిగిరి గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. కాగా, గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజ్‌ అయినట్లు టీవీ9 ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. ప్రవీణ్‌కకు 103 మార్కుల వచ్చినట్లు OMR షీట్ సహా ఆధారాలను బయటపెట్టింది టీవీ9. ఇతర ప్రశ్న పత్రాలు కూడా లీక్ అయినట్టు టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. గతేడాది అక్టోబర్ 16 న గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగగా.. రెండున్నర లక్షల మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాశారు. జనవరి 22 న అసిస్టెంట్ ఎగ్జక్యూటివ్ ఇంజినీరింగ్ ఎగ్జామ్ జరుగగా.. 60 వేలకు పైగా అభ్యర్థులు పరీక్ష రాశారు. డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఫిబ్రవరి 26 న నిర్వహించగా.. 60 వేలకు పైగా అభ్యర్థులు రాశారు. ఈ వ్యవహారంపై స్పందించిన టీఎస్‌పీఎస్సీ, సిట్ అంతర్గత విచారణ లోనూ ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టు నిర్దారించారు. దాంతో ప్రస్తుతం మూడు పరీక్షలు రద్దు చేయగా.. మరిన్ని పరీక్షలు రద్దు చేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..