‘సర్‌.. వాష్‌ రూంకు వెళ్లొస్తా..’ పరీక్ష కేంద్రం నుంచి మధ్యలోనే పరారైన అభ్యర్ధి

|

Aug 09, 2023 | 4:02 PM

టీఎస్పీయస్సీ ఆగస్టు 8వ తేదీన మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖలో అకౌంటెంట్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో టీఎస్పీయస్సీ పరీక్ష నిర్వహించింది. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షకు మేడ్చల్‌ మండలంలో 8 పరీక్ష కేంద్రాలను కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్‌ సెట్‌ కాలేజీలో కూడా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసేందుకు ఆదిలాబాద్‌ జిల్లా శాంతినగర్‌కు చెందిన మహ్మద్‌ అసర్‌ అనే అభ్యర్ధి..

సర్‌.. వాష్‌ రూంకు వెళ్లొస్తా.. పరీక్ష కేంద్రం నుంచి మధ్యలోనే పరారైన అభ్యర్ధి
TSPSC Exam
Follow us on

మేడ్చల్‌, ఆగస్టు 9: తెలంగాణ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖలో అకౌంటెంట్‌ పోస్టుల భర్తీకి మంగళవారం (ఆగస్టు 8) నిర్వహించిన రాత పరీక్షలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ పరీక్ష కేంద్రంలో పరీక్ష ప్రారంభమైన తర్వాత వాష్‌ రూం వెళ్తునని చెప్పి బయటికి వచ్చిన ఓ అభ్యర్ధి ఎవరికీ చెప్పకుండా అటునుంచటే వెళ్లిపోయాడు. ఈ విచిత్ర ఘటన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్‌ సెట్‌ కళాశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

టీఎస్పీయస్సీ ఆగస్టు 8వ తేదీన మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖలో అకౌంటెంట్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో టీఎస్పీయస్సీ పరీక్ష నిర్వహించింది. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షకు మేడ్చల్‌ మండలంలో 8 పరీక్ష కేంద్రాలను కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్‌ సెట్‌ కాలేజీలో కూడా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసేందుకు ఆదిలాబాద్‌ జిల్లా శాంతినగర్‌కు చెందిన మహ్మద్‌ అసర్‌ అనే అభ్యర్ధి హాజరయ్యాడు. పరీక్ష ప్రారంభమయ్యాక బయో సబ్జెక్ట్‌కు విరామ సమయంలో అంటే సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు అసర్‌ టాయిలెట్‌కు వెళ్తానని చెప్పి పరీక్ష నిర్వాహకుల నుంచి అనుమతి తీసుకొని బయటకు వెళ్లాడు.

ఐతే అలా బయటికి వెళ్లిన సదరు అభ్యర్ధి ఎంతకూ తిరిగి రాకపోవడంతో పరీక్ష కేంద్రం నిర్వాహకులు వెంటన్‌ అలర్ట్‌ అయ్యారు. దీంతో పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌రెడ్డి పరీక్ష మధ్యలోనే అభ్యర్ధి పారిపోయినట్లు మేడ్చల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అసర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఈ మేరకు సీఐ నర్సింహారెడ్డి ఓ ప్రకటనలో మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్‌లో ఏపీపీఎస్సీ పరీక్షల హాల్‌ టికెట్లు

ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ విభాగంలో టౌన్‌ప్లానింగ్‌ అండ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ పోస్టులకు నిర్వహించనున్న రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ పోస్టులకు దరఖాస్తు అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ వెల్లడించారు. ఆగస్టు18న ఉదయం, మధ్యాహ్నం రెండు ఫిస్టుల్లో పరీక్ష జరుగుతుంది.

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.