TS SSC Exam Date: తెలంగాణలో ఇంటర్ పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించగా, త్వరలో పదో తరగతి పరీక్ష షెడ్యూల్ కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఈ టెన్త్ పరీక్షలు మే నెలలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎస్‌ఎస్‌సీ బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయించింది. మే 9-12 తేదీల మధ్య పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒక వేళ ఇంటర్ పరీక్షలన్నీ పూర్తయ్యాక టెన్త్ పరీక్షలు పెట్టాలనుకుంటే మే 11,12 తేదీల్లో ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌లోనే జరగాల్సి ఉంది. ఇందు కోసం నవంబర్ నెల నుంచే అధికారులు కసరత్తు ప్రారంభిస్తారు. కరోనా కారణంగా పరీక్షలు లేకుండానే గత సంవత్సరం విద్యార్థులను పాస్ చేశారు. ఈ ఏడాది కూడా కోవిడ్ థర్డ్‌వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు ఉంటాయా..? లేదా అనే ఆలోచనలో పడిపోయింది విద్యాశాఖ. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల తర్వాత పరీక్ష షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
అయితే అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇటీవల పరీక్షల విభాగం డైరెక్టర్ ఓ ఉత్తర్వు జారీ చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల పూర్తి వివరాలతో కూడిన జాబితాను రూపొందించి త్వరగా వీటిని జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపాలని ఆదేశించారు. త్వరలో పదో తరగతి సిలబస్ పూర్తి చేసి రివిజన్ చేపట్టాలని, పరీక్షల కోసం విద్యార్థులను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి: