పీవీ పుట్టినిళ్లు సందర్శించిన మంత్రివర్గ బృందం

| Edited By: Pardhasaradhi Peri

Sep 13, 2020 | 11:45 AM

భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ న‌ర్సింహారావు శ‌త జ‌యంతి ఉత్సవాల‌లో భాగంగా మంత్రులు ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, వి.శ్రీ‌నివాస్ గౌడ్, స‌త్యవ‌తి రాథోడ్ పీవీ పుట్టిన ల‌క్నేప‌ల్లి గ్రామాన్ని సంద‌ర్శించారు. పీవీ పుట్టిన ఇంటిని..

పీవీ పుట్టినిళ్లు సందర్శించిన మంత్రివర్గ బృందం
Follow us on

భారత మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ న‌ర్సింహారావు శ‌త జ‌యంతి ఉత్సవాల‌లో భాగంగా మంత్రులు ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, వి.శ్రీ‌నివాస్ గౌడ్, స‌త్యవ‌తి రాథోడ్ పీవీ పుట్టిన ల‌క్నేప‌ల్లి గ్రామాన్ని సంద‌ర్శించారు. పీవీ పుట్టిన ఇంటిని ప‌రిశీలించారు. పీవీ జన్మస్థలాన్ని ప‌ర్యాట‌క ప్రాంతంగా అభివృద్ధి చేయడంతోపాటు, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్ధి స్మార‌క చిహ్నం ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి పీవీ ఇంటి దగ్గర క‌నీసం అర ఎక‌రం స్థలం అవ‌స‌ర‌మ‌ని, ఆ స్థల సేక‌ర‌ణ జ‌రిపే విష‌యం స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శన్ రెడ్డి చూస్తే, వెంట‌నే అభివృద్ధి ప‌నులు చేప‌డ‌తామ‌న్నారు. అలాగే, గ్రామంలోని ఎక‌రం ప్రభుత్వ స్థలాన్ని అభివృద్ధి పరుస్తామ‌న్నారు. ల‌క్నేప‌ల్లి చెరువుని మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దుతామ‌న్నారు. పనిలో పనిగా మంత్రులు వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఇప్పటికే పీవీ ద‌త్తత‌కు వెళ్ళిన వంగ‌ర గ్రామంలోని ఆయ‌న ఇంటిని మ‌న వార‌స‌త్వ సంప‌ద‌గా గుర్తించి భ‌ద్రప‌రుస్తున్నామ‌న్నామని చెప్పారు.