‘ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమం ఆగదు’

| Edited By: Pardhasaradhi Peri

Sep 13, 2020 | 11:45 AM

ఎన్ని ఇబ్బందులు ప్రభుత్వానికి ఎదురైనా రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆగవని నిరంతరం ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు...

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమం ఆగదు
Follow us on

ఎన్ని ఇబ్బందులు ప్రభుత్వానికి ఎదురైనా రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆగవని నిరంతరం ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో ఆయా అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పర్యటించారు. షాద్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తూ పలు రోడ్డు నిర్మాణం పనులకు మంత్రి సబిత శంకుస్థాపనలు చేశారు. నియోజకవర్గంలోని కొందుర్గు మండలంలో జరిగిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, అధికారులు హాజరైన కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆయా గ్రామాల రోడ్డు పనులకు లాంఛనంగా శంకుస్థాపన చేశారు. గంగన్నగూడెం నుండి గుంజల పహాడ్ వయా రావిర్యాల, కాసుల బాద్ నుండి పిర్జాపూర్ ఇతర గ్రామాలకు వెళ్లే రహదారులకు బిటి రోడ్డు సౌకర్యాలు కల్పిస్తూ శంకుస్థాపనలు చేశారు.