ఒకప్పుడు ఐటీ కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఐటీ రంగం కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైంది. కాస్త కూస్తో విశాఖపట్నంలో విస్తరించినా అది నామమాత్రమేనని చెప్పాలి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ద్వితియ శ్రేణీ నగరాల్లో ఐటీ పరిశ్రమలను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లాలలకు ఐటీ సంస్థలను విస్తరించార. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, సిద్ధిపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఐటీ హబ్‌లు ప్రారంభించారు.
ఇప్పటికే ఆయా క్యాంపస్‌లలో ఐటీ కార్యకలాపాలు కూడా నడుస్తున్నాయి. దీంతో ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు హైదరాబాద్ రావాల్సిన అసవరం లేకుండానే సొంత జిల్లాల్లోనే ఐటీ కొలువులు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఐటీ హబ్‌ల జాబితాలో మరో జిల్లా వచ్చి చేరింది. నల్లగొండలోనూ ఐటీ హబ్‌ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఐటీ హబ్ నిర్మాణం కూడా పూర్తి కావొస్తుంది. నల్లగొండ ఐటీ హబ్‌కు సంబంధించిన ఫొటోలను మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. త్వరలోనే ఈ ఐటీ హబ్ ప్రారంభం కానున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం టైర్ టూ పట్టణాల్లోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే మహబూబ్ నగర్, సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ పట్టణాల్లో ఐటీ హబ్‌లు ప్రారంభించినట్లు తెలిపిన మంత్రి.. త్వరలోనే నల్లగొండ ఐటీ హబ్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వచ్చే రోజుల్లో తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో ఐటీ హబ్‌లు ప్రారంభిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
Telangana Govt’s efforts to develop IT sector in Tier 2 towns is going on at a brisk pace
After Warangal, Khammam, Karimnagar, Mahbubnagar, Siddipet and Nizamabad now it’s Nalgonda
In a few weeks from now, Nalgonda will have its own IT Hub pic.twitter.com/1wwtc2tfc3
— KTR (@KTRBRS) September 2, 2023
గ్రామీణ ప్రాంతాలకు ఐటీ పరిశ్రమలను విస్తరించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకులు ఐటీ ఉద్యోగాలను సొంత జిల్లాల్లో ఉంటూనే చేసుకునే వెసులుబాటు కలగుతుంది. ఇది సహజంగానే అభివృద్ధి వికేంద్రీకరణకు దోహద పడుతుందని ప్రభుత్వం ఆలోచనగా ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..