Harish Rao on Telangana Congress : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలిమినేట్ అయిందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇక.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ అమలైతే, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందన్న భయం టీసీఎల్పీ అధ్యక్షుడు భట్టి విక్రమార్కకు పట్టుకుందని హరీశ్ చెప్పుకొచ్చారు. అందుకనే భట్టి ఏంమాట్లాడుతున్నారో అర్థం కాకుండా ఉందని హరీశ్ ఎద్దేవా చేశారు.