TS Politics: మమ్మల్ని బెదిరించడం కాదు.. దమ్ముంటే వరిని కొనేలా కేంద్రాన్ని బెదిరించు.. కేంద్రమంత్రికి గంగుల కౌంటర్‌..

తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరుసగా రెండు రోజులు..

TS Politics: మమ్మల్ని బెదిరించడం కాదు.. దమ్ముంటే వరిని కొనేలా కేంద్రాన్ని బెదిరించు.. కేంద్రమంత్రికి గంగుల కౌంటర్‌..

Updated on: Nov 09, 2021 | 6:15 PM

తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరుసగా రెండు రోజులు ప్రెస్‌మీట్‌ ఏర్పాటుచేసి బీజేపీ నేతలను ఎండగట్టిన సంగతి తెలిసిందే. ఆతర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సమావేశం పెట్టి కేసీఆర్‌కు కౌంటర్‌ ఇవ్వడం, తాజాగా మంగళవారం ఉదయం కేంద్రమంత్రి కూడా ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. తాజాగా కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ముఖ్యమంత్రిని తూలనాడుతోన్న బండి సంజయ్‌ని అదుపులో పెట్టుకోవాలని కేంద్రమంత్రికి సూచించారు. ధాన్యం సేకరణపై కేంద్రంలోని బీజేపీ నాటకాలాడుతోందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధాన్యం కొనలేమన్నారు..
‘మేం సెప్టెంబర్ 1న స్వయంగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఇంటికి వెళ్లి ధాన్యం సేకరణపై చర్చించాం. తమ వద్ద 4 ఏళ్లకు సరిపడా బాయిల్డ్ రైస్ ఉందని.. ఇక తాము తీసుకోమని కేంద్రమంత్రి మాతో చెప్పారు. మా కష్టాలను చెప్పుకోవాలని వెళితే దిల్లీ వాళ్లు మాపై వ్యంగ్యంగా విమర్శలు చేశారు. ఆరోజు ఒక్కమాట మాట్లాడని కిషన్ రెడ్డి ఈరోజు గట్టిగా మాట్లాడుతున్నారు. కేంద్రమంత్రి కేసీఆర్‌ను బెదిరించడం కాదు.. దమ్ముంటే పియూష్‌ గోయల్‌, దిల్లీ బీజేపీ నేతలను బెదిరించాలి. తెలంగాణ వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పించాలి. ఆయనకు రాష్ట్రంపై ప్రేమ ఉంటే ధాన్యం సేకరణ కోసం మేం చేపడుతున్న ధర్నాల్లో పాల్గొనాలి. ఇక ముఖ్యమంత్రిని ఇష్టమొచ్చినట్లు తిడుతున్న బండి సంజయ్‌ నోటికి కేంద్ర మంత్రి తాళం వేయండి. ఆయనను అదుపులో పెట్టుకోవాలి’ అని మంత్రి హెచ్చరించారు.

Also Read:

AP CM Jagan Odisha Tour: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సీఎం వైఎస్ జగన్‌ భేటీ

CM KCR Warangal Tour: రేపు సీఎం కేసీఆర్ వరంగల్, హన్మకొండ జిల్లాల పర్యటన రద్దు..!

Tarun Chug: త్వరలో తెలంగాణలో రామరాజ్య స్థాపన.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్