KTR on kiosks: హైదరాబాద్, వరంగల్ వంటి పలు నగరాల్లోని ప్రముఖ ప్రదేశాల సమాచారాన్ని తెలుసుకోవడానికి సందర్శకులకు కియోస్క్‌లుగా ఉపయోగకరంగా ఉంటాయని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. లండన్‌లో ప్రముఖ ప్రాంతాల స్ట్రీట్ మ్యాప్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వంటి విషయాలను కియోస్క్ ద్వారా తెలుసుకోవచ్చని, అలాంటివి తెలంగాణలో పెడితే బాగుంటుందని ఓ నెటిిజన్ పెట్టిన పోస్ట్‌పై కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ‘వాటిని త్వరలోనే హైదరాబాద్‌లో అందుబాటులోకి తెస్తామ’న్న ఆయన.. కియోస్కలపై అధ్యయనం చేసి, ముందుగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌కు ఆదేశాలు జారీచేశారు.
Anuj, We will get this done in Hyderabad too
ఇవి కూడా చదవండిRequest @arvindkumar_ias Garu and @GadwalvijayaTRS Garu to start working on this ? https://t.co/KUY3zQf3fX
— KTR (@KTRBRS) May 27, 2023
ఇక ఈ కియోస్క్‌ల గురించి చెప్పుకోవాలంటే.. ఇవి పర్యాటకులు తాము ఉన్న నగర పరిధిలోని ప్రదేశాలకు సులభంగా చేరుకోవడానికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వివరాలతో పాటు, స్ట్రీట్ మ్యాప్‌లు, డైరెక్షన్స్, ఫుడ్ సెంటర్స్, రెస్టారెంట్స్ వంటి సమాచారాన్ని అందించడంలో ఎంతగానో సహాయపడతాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..