TS Graduate MLC Elections: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలింగ్ కేంద్రం వద్ద సీపీఐ, సిపిఎం, టిడిపి, బీజేపీ నాయకుల ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే కార్యాలయం ఎదురుగా ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్నారని ఆరోపిస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓటర్లకు డబ్బులిచ్చి పోలింగ్ కేంద్రంలోకి పంపిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం వరకు ప్రచారం నిర్వహించకూడదనే నిబంధన ఉన్నా.. పోలింగ్ కేంద్రం ఎదురుగా ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అడ్డాగా చేసుకుని ప్రచారం సాగిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఉన్న ప్రచార ప్లెక్సీలను కూడా అధికారులు తొలగించలేదని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. ప్లెక్సీలు తొలగించడంతో పాటు.. ఎన్నికలు ముగిసే వరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మూసివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. ఉదయం 8 గంటల నుంచే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది.
Also read:
AP Municipal Election Results 2021 LIVE: అదే తీరు అదే జోరు ఏపీలో కొనసాగుతున్న ఫ్యాన్ హవా