Trs Party: ఆ విషయంలో ఖమ్మం జిల్లా నేతలకు క్లాస్ పీకిన మంత్రి కేటీఆర్! త్వరలోనే ప్రత్యేక సమావేశం ఉంటుందంటూ..!

|

Jun 11, 2022 | 8:47 PM

Trs Party: ఓవైపు రెచ్చిపోతున్న ప్రతిపక్షాలు.. మరోవైపు పార్టీలో అంతర్గత పోరు.. కీలక నేతల మధ్య బహిర్గతమవుతున్న విభేదాలు..

Trs Party: ఆ విషయంలో ఖమ్మం జిల్లా నేతలకు క్లాస్ పీకిన మంత్రి కేటీఆర్! త్వరలోనే ప్రత్యేక సమావేశం ఉంటుందంటూ..!
Minister Ktr
Follow us on

Trs Party: ఓవైపు రెచ్చిపోతున్న ప్రతిపక్షాలు.. మరోవైపు పార్టీలో అంతర్గత పోరు.. కీలక నేతల మధ్య బహిర్గతమవుతున్న విభేదాలు.. కనుచూపు మేరలో ఎన్నికలు.. ఇక లాభం లేదనుకున్న పార్టీ వర్కింగ్ కేటీఆర్.. నేరుగా కథనరంగంలోకి దూకారు. ముందుగా పార్టీలో అంతర్గతంగా తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు నడుంబిగించారు చిన్న బాస్. ముందుగా.. ఖమ్మం టీఆర్ఎస్‌లోని వర్గ విభేదాలపై ఫోకస్ పెట్టారు.

ఈ నేపథ్యంలో ఖమ్మం టీఆర్ఎస్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రి పువ్వాడ అజయ్‌తోపాటు.. జిల్లాఎమ్మెల్యేలు హాజరయ్యారు. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హాజరయ్యారు. అందరితో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. వర్గ విబేధాలు వీడి పార్టీ అభివృద్ధి కోసం నేతలందరూ కలిసి పనిచేయాలని క్లాస్‌ తీసుకున్నారు. విభేదాలు వీడి ఐక్యంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.

కొన్ని రోజులుగా మంత్రి పువ్వాడ అజయ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ మధ్య మాజీ మంత్రి తుమ్మల పరోక్షంగా కామెంట్స్‌ చేయడం.. సమీక్షలు నిర్వహించడంతో ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాకుండా.. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య ఘటన సమయంలో తనకు అండగా జిల్లా నేతలు ఎవరూ నిలవలేదన్న అసంతృప్తితో మంత్రి పువ్వాడ ఉన్నారు. ఈ విభేదాలన్నీ పార్టీకి చేటు చేస్తాయని భావించిన కేటీఆర్.. వెంటనే అలర్ట్ అయి దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. త్వరలోనే జిల్లా నేతలతో హైదరాబాద్‌లో సమావేశం ఉంటుందని, అన్ని విషయాలు అక్కడ చర్చిస్తామని కేటీఆర్ వారికి తెలిపారు. కేసీఆర్ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని, ఆయన నాయకత్వంలో పని చేయాలని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..