Huzurabad By Election: హుజూరాబాద్‌‌ గెలుపే లక్ష్యంగా పని చేయండి.. నియోజకవర్గ సమీక్షలో సీఎం కేసీఆర్

|

Aug 20, 2021 | 8:48 PM

తెలంగాణలోప్రస్తుతం రాజకీయాలన్నీ హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం అక్కడే ప్రారంభం అయ్యింది.

Huzurabad By Election: హుజూరాబాద్‌‌ గెలుపే లక్ష్యంగా పని చేయండి.. నియోజకవర్గ సమీక్షలో సీఎం కేసీఆర్
Cm Kcr
Follow us on

CM KCR review on Huzurabad: తెలంగాణలోప్రస్తుతం రాజకీయాలన్నీ హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం అక్కడే ప్రారంభం అయ్యింది. సీఎం కేసీఆర్ నియోజకవర్గం నుంచే లాంఛనంగా శ్రీకారం చుట్టారు.దళితబంధు పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ప్రారంభిస్తుండటంతో ఈ సభకు రాజకీయంగానూ ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం బహిరంగ సభ అనంతరం పరిణామాలు, ప్రస్తుతం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులపై సీఎం సమీక్షించారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లి శ్రీనివాస్‌ను ప్రకటించిన కేసీఆర్.. ఆయన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషీ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలన్నారు.

మరోవైపు, మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ బర్తరఫ్, అనంతరం టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరడం నాటకీయ పరిణామాల్లో జరిగిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. నియోజకవర్గంలో పెండింగ్‌ పనుల పూర్తి కోసం సుమారు రూ.1,500 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చే విధంగా దళితబంధు పథకాన్ని ప్రకటించింది. మరోవైపు పార్టీ పరంగా మంత్రులు, ఎమ్మెల్యేలను ఇన్‌చార్జీలుగా నియమించి ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాల విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? అధికార పార్టీ విషయంలో ఏ విధమైన అభిప్రాయంతో ఉన్నారు? తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్న హుజూరాబాద్‌ నియోజకవర్గంలో భారీగా ఇంటెలిజెన్స్‌ వర్గాలు మకాం వేశాయి. ప్రధాన రాజకీయ పార్టీల కదలికలు, ఆ పార్టీల విషయంలో ప్రజా అభిప్రాయాన్ని అంచనా వేయడంలో నిమగ్నమయ్యాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏ పార్టీ ‘గ్రాఫ్‌’ఎలా ఉందో లెక్కలు కడుతున్నాయి. హైదరాబాద్, పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన సుమారు 200 మంది ఇంటెలిజెన్స్, స్పెషల్‌ బ్రాంచ్‌ల అధికారులు, సిబ్బంది నియోజకవర్గంలోని కమలాపూర్, ఇల్లందకుంట, వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్‌ మండలాల్లోని గ్రామాల్లో తిరుగుతూ అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. కాగా, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, టీఆర్‌ఎస్‌ నుంచి గెల్లు శ్రీనివాస్‌ల పేర్లు ఖరారు కావడంతో మాజీ మంత్రి కొండా సురేఖను పోటీలో నిలపాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Read Also…  Telangana Corona: తెలంగాణలో శాంతించిన కరోనా మహమ్మారి.. కొత్తగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..