Huzurabad Bypoll: రిజల్ట్ అనంతరం గెల్లు శ్రీనివాస్ కంట కన్నీరు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

Huzurabad Bypoll: తెలంగాణలోని ఈటెల రాజేంద్ర రాజీనామా చేసి.. మళ్ళీ తన నియోజవర్గం హుజురాబాద్ లో ఉప ఎన్నికలకు  వెళ్లిన సంగతి తెలిసిందే. ఈరోజు ఈ ఉపఎన్నికల్లో..

Huzurabad Bypoll: రిజల్ట్ అనంతరం గెల్లు శ్రీనివాస్ కంట కన్నీరు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
Gellu Srinivas

Updated on: Nov 02, 2021 | 6:55 PM

Huzurabad Bypoll: తెలంగాణలోని ఈటెల రాజేంద్ర రాజీనామా చేసి.. మళ్ళీ తన నియోజవర్గం హుజురాబాద్ లో ఉప ఎన్నికలకు  వెళ్లిన సంగతి తెలిసిందే. ఈరోజు ఈ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేంద్ర మళ్ళీ పోటీకి నిలుచున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున హుజురాబాద్ అసెంబ్లీ నుంచి  గెల్లు శ్రీనివాస్ పోటీ పడ్డారు. అయితే హుజురాబాద్ ప్రజలు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు పట్టంగట్టారు. ఈ నేపథ్యంలో గెల్లు శ్రీనివాస్ తన ఓటమి జీర్ణించుకోలేకపోయినట్లు ఉన్నారు. ముఖ్యంగా గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం హిమ్మత్ నగర్, ఆయన అత్తగారి ఊరైన పెద్దపాపయ్యపల్లెనూ ఈటల పాగా వేశారు. గెల్లు శ్రీనివాస్ కంటే కూడా మెజార్టీ ఓట్లను సాధించారు.  తన ఓటమితో గెల్లుశ్రీనివాస్ కంట కన్నీరు పెట్టుకున్నారంటూ ఓ వీడియో ఈ  ప్రస్తుతం ఈ వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read:  బాణాసంచా కాల్చే సమయంలో కంటి రక్షణ కోసం తీసుకోవాలిన జాగ్రత్తలు.. మీకోసం..