ధూమ్‌ధామ్‌గా 21 ఏళ్ల గులాబీ ఆవిర్భావ సభ..ప్లీనరీ వేదికపై TRS జెండా ఆవిష్కరించారు CM KCR..ఆ తర్వాత అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు..కేసీఆర్ స్వాగత ఉపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. 3 వేల మంది పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.. ప్లీనరీకి వచ్చేవారికి ప్రత్యేక పాస్‌లు LED స్క్రీన్లతో భారీ వేదిక ఏర్పాటు చేశారు. TRS తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోటన్నారు CM KCR. ఎవ్వరూ బద్దలు కొట్టని కోటని..TRS తెలంగాణ ప్రజల ఆస్తి అన్నారు. 60లక్షల మంది పార్టీ శ్రేణులతో.. వెయ్యి కోట్లకు పైగా ఆస్తులున్న పార్టీ TRS అన్నారు. దేశానికే రోల్‌మోడల్‌గా తెలంగాణ పాలన ఉందన్నారు KCR..దేశంలో అతి ఉత్తమమైన 10 గ్రామాలు తెలంగాణవే అన్నారు..
TRS పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో మంత్రి KTR గులాబీ జెండాను ఆవిష్కరించారు. 40 ఫీట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, MLA దానం నాగేందర్ తో పాటు TRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం KTR కేక్ కట్ చేశారు. తెలంగాణ ప్రజల గుండెల నిండా గులాబీ జెండా ఉందన్నారు మంత్రి హరీష్‌రావు ..TRS పార్టీ నాయకులు, కార్యకర్తలకు TRS ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.TRS పార్టీ జాతీయ రాజకీయాల్లో కచ్చితంగా కీలక పాత్ర పోషిస్తాం అన్నారు హరీష్..ప్రశాంత్‌కిషోర్‌తో కలిసి బీజేపీ, కాంగ్రెస్ పనిచేయలేదా మేము పనిచేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ పార్టీలో జాతీయ రాజకీయాల వ్యవహారాల కమిటీ ఏర్పాటు.. కమిటీ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత నియామకం
తెలిసిన దాని చుట్టే ఆలోచనలు తిరుగుతున్నాయి. చదువుకున్న వాళ్లకు సైతం చాలా విషయాలు దూరంలోనే ఉన్నాయి. 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఏం జరిగందో దేశ ప్రజలందరికీ తెలుసు. ఏ పద్ధతిలో స్వాతంత్ర్య ఫలాలు ప్రజలకు లభించాలో ఆ పద్ధతిలో లభించలేదు.
దేశం తన లక్ష్యం కోల్పోయింది. లక్ష్యరహిత దేశంగా భారత్ ముందుకెళ్తోంది. సామూహిక లక్ష్యాన్ని కోల్పోయి ఏకతాటిగా భారత్ ఎందుకు ముందుకు వెళ్లలేకపోతోంది? సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది సీఎం కేసీఆర్.
అన్నీ మనకే తెలుసన్న అహంకారం పక్కనపెట్టాలి.. తెలిసిన వాళ్లను తెలియని వివరాలు అడిగి నేర్చుకోవాలి. అలా చేయబట్టే తెలంగాణ ప్రతీ రంగంలో అవార్డులు సాధిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని.. భారతీయ రాష్ట్ర సమితి చేయాలని అంటున్నారు. దేశంలో రాజకీయ ఫ్రంట్లు ఏం సాధించాయని ప్రశ్నించారు. ప్రజలే అజెండాగా ఫ్రంట్లు రావాలి. మన రాష్ట్రం నుంచి ఏదైనా జరిగితే మనకు గర్వకారణం. దేశం గతి, స్థితిని మార్చడానికి హైదరాబాద్ వేదిక మారుతుందన్నారు.
విమానాలు దిగుతూనే కత్తలతో ర్యాలీలు నిర్వహించడం ఇదెక్కడి పద్దతని అని ప్రశ్నించారు.
దేశంలో ఏం జరుగుతోంది. ఇలా విద్వేషాలు పెచ్చరిల్లుతున్నాయి. రాజకీయ పబ్బం కోసమే కొందరు ప్రజలను రెచ్చగొడుతున్నారు. బెంగళూరులో ప్రతి రోజు ఒక్కో వివాదం తెరమీదికి వస్తోంది. ఇదేం పద్దతి అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
మహాత్మాగాంధీని దూషించడం ఏంటని ప్రశ్నించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనను చంపిన వ్యక్తులకు పూజలు చేయడం ఏంటన్నారు. దేశంలో మత విద్వేషాలు తీసుకురావడం ఎంతవరకు మంచిదని అన్నారు.
ఈ దేశంలో 65 వేల టీఎంసీల నీరు పుష్కలంగా ఉండగా.. రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ దేశంలోని నీటి వనరులపై ప్రశ్నించారు.
కమ్యూనిస్ట్ నేతలు నన్ను కలిశారు. బిజెపిని గద్దె దించడానికి మాతో కలిసి రావాలని వామపక్ష నేతలు నన్ను కోరారు. మీది చెత్త ఐడియా.. ఎవరినో గద్దె దించటానికి రాను.. ప్రజలను గద్దె ఎక్కించడానికి వస్తా అని చెప్పాను.
తెలంగాణ జలబండగారం అయింది. అవినీతి తో వికెట్ పడే మంత్రులు తెలంగాణలో లేరు. 3మెడికల్ కాలేజీలు ఉన్న తెలంగాణ 33మెడికల్ కాలేజీలు నిర్మించుకుంటున్నం. టీఆర్ఎస్ పని చేసిన తీరుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వ తీరు ఉంటే 14లక్షల కోట్ల జిడిపి ఉండేది.. దేశంలో స్వతంత్ర ఫలాలు అందరికీ లభించలేదు..పెడదోరని దేశంలో పెరుగుతోంది. 4,01,035 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్ధ్యం దేశానికి ఉంది.. గుజరాత్ లో కరెంట్ కోతలు, రైతుల రాస్తారోకో లు.. మన చుట్టూ అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ కోతలే అన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరేళ్ల కాలంలో వెలుగు జిలుగుల తెలంగాణను ఆవిష్కరించాము. దేశంలో కరెంట్ కోతలు ఎందుకు ఉన్నాయి. దేశ నదుల్లో నీటి లభ్యత 65వేల టిఎంసి. 30వేల టీఎంసీల ను మాత్రమే దేశం వినియోగించు కుంటుంది. ఎందుకు ఈ దౌర్భాగ్యం. లోపం ఎక్కడ ఉంది. దేశం తాగు నీరు, సాగు నీరు లేదు, మౌలిక వసతులు లేవు. దీనికి ఎవరి అసమర్థ కారణం.. దీని మీద చర్చ జరగాలి, పరిష్కారం లభించాలి. అందుకోసం మనం మన పాత్ర పోషించాలి.
ప్లీనరీలో కేంద్రంపై ప్రశ్నలు వర్షం కురపించారు సీఎం కేసీఆర్. దేశంలో ఎందుకు కరెంట్ కోతలు ఉన్నాయంటూ ప్రశ్నించారు.
తెలంగాణలో అవినీతి మంత్రులు లేరు. డబ్బాలు కొట్టుకోవడం, అతిగా పొగుడుకోవాల్సిన అవసరం తెలంగాణకు లేదు. దేశంలో పది ఉత్తమమైన గ్రామాలు తెలంగాణావే. కేంద్రం ఇచ్చిన ఈ సర్టిఫికెట్టే అందుకు నిదర్శనం అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
తెలంగాణ ప్రజల కాపలాదారు టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. దేశంలో పది అత్యుత్తుమ గ్రామాలు తెలంగాణవే అని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు ప్రశంసించింది. ఇది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పనితీరుకు ఈ ఫలితాలే నిదర్శనం అని అన్నారు. అవార్డు, రివార్డు రాని తెలంగాణ డిపార్ట్‌మెంట్ లేదు.
టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ప్రాంగణానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేరుకున్నారు. ప్లీనరీ సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహముద్ అలీ, హరీశ్‌రావు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, గువ్వల బాలరాజు, బాల్క సుమన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
రెండు దశాబ్దాల క్రితం ఏడుపు వస్తే కూడా ఎవర్నీ పట్టుకొని ఎడ్వాలో తెలువని పరిస్థితి అని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర అస్థిత్వమే ఆగమయైపోయే పరిస్థితి. ఒక దిక్కుతోచని సందర్భంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్రజల గుండెల నుంచి ఈ గులాబీ జెండా ఎగిసిపడింది. అపజయాలు, అవమనాలు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించాం. రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ప్రజల దీవెనతో అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం. దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ నిలిచింది అని కేసీఆర్ తెలిపారు.
దేశంలో జరుగుతున్న దారుణాలపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించడం శుభసూచకమని TRS ఎంపీ కే కేశరావు అన్నారు. జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ తరహా అభివృద్ధి నమూనా అమలు చేయాలంటే కేసీఆర్ లాంటి సమర్థ నేత మరో పోరాటానికి పూనుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. HICCలో జరుగుతున్న TRS ప్లీనరీలో ఎంపీ కేకే స్వాగతోపన్యాసం చేశారు. అసమర్ధ కేంద్ర ప్రభుత్వంపై జరుగుతున్న పోరాటంలో టీఆర్‌ఎస్ క్రియాశీల పాత్ర పోషించే సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ ఏ కార్యం తలపెట్టినా తెలంగాణ సమాజం అండగా నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల ఆస్తి అని ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ఉన్న పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు.
ప్రగతిభవన్ నుంచి ప్లీనరీ కార్యక్రమానికి చేరుకున్నారు సీఎం కేసీఆర్. పార్టీ అధినేత రాకతో హెచ్‌ఐసీసీ ప్రాంగణం సందడిగా మారింది.
TRS ప్లీనరీ కోసం పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 2500 మందితో బందోబస్తు నిర్వహస్తున్నారు. HICCలో ఉన్న 200 CC కెమెరాలను సైబరాబాద్ కమాంట్ కంట్రోల్‌కు అనుసంధానం చేశారు.TRS ప్లీనరీ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు మార్గాల్లో ఆంక్షలు విధించారు. వాహనదారులందరూ ట్రాఫిక్ ఆంక్షలు పాటించి సహకరించాలని పోలీసులు అధికారులు కోరారు.
ఈ సమావేశంలో TRS పార్టీకి కీలకం కానుంది. ఈ వేధిక నుంచే 2023 ఎన్నికల వ్యూహాన్ని రచించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశ రాజకీయాలపైనా కూడా బ్లూ ప్రింట్‌ను ఆవిష్కరించునున్నారు. వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలుండటం.. ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు.. ప్రశాంత్ కిశోర్ ఎంట్రీ.. కేంద్రంతో పోరు.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం..వంటి అంశాల మధ్య ఈ ప్లీనరీ జరుగుతోంది.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో టీఆర్ఎస్ కలిసి పనిచేస్తే తప్పేంటని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఇదే ప్రశాంత్ కిషోర్ గతంలో కాంగ్రెస్, బీజేపీలతో కలిసి పనిచేశారని గుర్తుచేశారు. తప్పనిసరిగా భవిష్యత్‌లో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తంచేశారు.
పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో 40 అడుగుల TRS పార్టీ జెండాను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) ఎగురవేశారు. TRS పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ 40 అడుగుల పార్టీ జెండాను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ కేక్ కట్ చేశారు. తెలంగాణ పాటలు, బాణసంచా చప్పుళ్ళ తో తెలంగాణ భవన్ సందడిగా మారింది. TRS పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రేర్ ఫోటోను మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు.
Two decades ago, our leader Sri KCR Garu founded TRS Party to make the aspirations of people of #Telangana a reality
Very grateful to be a part of this inspiring journey from agitation to administration!
Heartfelt greetings to @trspartyonline leaders & members on #21YearsOfTRS pic.twitter.com/9xaK8fEOve
— KTR (@KTRTRS) April 26, 2022
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులు, దేశ విదేశాల్లోని గులాబీ అభిమానులకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేశవిదేశాల్లోని ‘గులాబీ’ అభిమానులకు..
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు..
తెలంగాణ ప్రజల గుండెల నిండా… గులాబీ జెండా!!#21YearsOfTRS
2/2— Harish Rao Thanneeru (@trsharish) April 27, 2022
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల సందర్భంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ రేర్ వీడియోను ఎమ్మెల్సీ కే.కవిత ట్విట్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న మన కేసీఆర్ ఆధునిక గాంధీగా అభివర్ణించారు.
బిగించిన పిడికిలి..
ఉద్యమాన్ని రగిలించిన ధీశాలి..రాష్ట్ర సాధన కోసం దేశాన్ని కదిలించి గమ్యాన్ని ముద్దాడి, తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్న ఆధునిక గాంధీ మన కేసీఆర్ గారు..
నాడు నేడు తెలంగాణకు టిఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష..#మనతెలంగాణమనకెసీఆర్#21YearsOfTRS pic.twitter.com/b3ULCP3i5L
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 26, 2022
పార్టీ ప్లీనరీలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తున్న పార్టీ శ్రేణులకు సోషల్ మీడియా వేదికగా స్వాగతం పలికిన టీఆర్ఎస్.
టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి తెలంగాణ నలుమూలల నుండి విచ్చేస్తున్న పార్టీ ప్రతినిధులకు హార్దిక స్వాగతం!#21YearsOfTRS pic.twitter.com/8bqwD1C56E
— TRS Party (@trspartyonline) April 27, 2022
ఈ సమావేశంలో మొత్తం 11 తీర్మానాలను ప్రవేశ పెట్టనున్నారు. వీటిలో మూడు రాజకీయ తీర్మానాలు ఉంటాయ్. తెలంగాణపై కేంద్రం వివక్ష, జాతీయ ప్రత్యామ్నాయ వేదిక, లేదా కొత్త పార్టీ. ఇక దేశ పాలనలో కేంద్ర వైఫల్యాలు.. వంటి అంశాలపై ఈ మూడు తీర్మానాలు ఉండబోతున్నాయి. వీటితో పాటు TRS అభివృద్ధి, సంక్షేమం, దళిత బంధు, భారీగా ఉద్యోగ నియామకాలు, విజయాలు, పురస్కారాలు తదితర అంశాలపై మిగిలిన తీర్మానాలుంటాయని సమాచారం.
21వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుగుతోంది..ఇక 11 గంటలకు CM KCR తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి ప్లీనరీని ప్రారంభిస్తారు.ఆ వెంటనే KCR ప్రసంగం ఉంటుంది. అనంతరం వివిధ అంశాలపై రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించి ఆమోదిస్తారు.
రాజకీయ తీర్మానాల ద్వారా వచ్చే ఎన్నికల లోపు ఏం చేయబోతున్నారో అనే దానిపై క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ భవన్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండా ఎగురవేశారు. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు మొత్తం గులాబీమయంగా మారాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) ప్లీనరీ సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు అమలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోండి..
21 ఏళ్ల గులాబీ ఆవిర్భావ సభ ధూమ్‌ధామ్‌గా నిర్వహిస్తున్నారు. హైటెక్ హంగులతో ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ కన్వెన్షన్ హల్లోకి మూడు వేల మందికి మాత్రమే ఎంట్రీ ఉంది. బార్‌కోడ్‌తో కూడిన ఐడెంటిటీ కార్డులు ఇప్పటికే జారీ చేశారు.
ప్లీనరీకి హాజరయ్యే ప్రజాప్రతినిధులకు నోరూరించే వంటకాలను సిద్ధం చేశారు. మొత్తం 33రకాల వెరైటీలను ఏర్పాటుచేశారు. తెలంగాణ రుచులతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాలను వేడివేడిగా వడ్డించేందుకు ఏర్పాట్లు చేశారు. వెజ్, నాన్‌వెజ్ స్పెషల్స్, తెలంగాణ నాటుకోడి కూర, చికెన్ ధమ్ బిర్యానీ, మటన్‌కర్రీ, గుత్తి వంకాయ, రోటీ పచ్చళ్లను సిద్ధం చేశారు.
TRS ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ గులాబీమయంగా మారింది. భాగ్యనగర నేతలు..HICC పరిసరాలతోపాటు.. పలు కూడళ్లలో భారీగా గులాబీ జెండా తోరణాలు, KCR, KTR కటౌట్లు, ఫ్లెక్సీలతో నింపేశారు.TRS ప్లీనరీ కోసం పసందైన వంటలు రెడీ అయ్యాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా అతిథులకు స్పెషల్ మెనూ సిద్ధమైంది. ప్లీనరీ ప్రాంగణం రుచికరమైన వంటకాలతో ఘుమఘుమలాడుతోంది.
TRS ఆవిర్భావోత్సవానికి హైదరాబాద్ గులాబీ మయంగా మారింది. ఎటు చూసినా.. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, బ్యానర్లు, కటౌంట్లు దర్శనమిస్తున్నాయి.అలంకరణ తోరణాలు, బ్యానర్లతో కొత్త కళ సంతరించుకుంది. అదే స్థాయిలో సమావేశాలకు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్- మాదాపూర్‌లోని HICCలో ఈ సమావేశం జరుగుతోంది.
ఈ గులాబీ పండుగకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్లు చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్‌లు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు, DCCB, DCMS అధ్యక్షులు, జిల్లాల గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, మహిళా కోఆర్డినేటర్లు, మున్సిపల్ మేయర్‌లు, చైర్మన్లు, ZPTC సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, పట్టణాల, మండలాల పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌లు హాజరైయ్యారు.
పార్టీ చీఫ్, CM KCR అధ్యక్షతన ఈ పండుగ జరుగుతుంది..ఈ సమావేశంలో TRS పార్టీకి కీలకం కానుంది. ఈ వేధిక నుంచే 2023 ఎన్నికల వ్యూహాన్ని రచించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశ రాజకీయాలపైనా కూడా బ్లూ ప్రింట్‌ను ఆవిష్కరించునున్నారు.ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఈ ప్లీనరీ తీర్మానాలు ఉండేలా తెలుస్తోంది.
TRS పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భాగ్యనగరం గులాబీమయంగా మారింది.గులాబీ పార్టీ 21వ వార్షికోత్సవానికి సర్వం సిద్ధం చేశారు నేతలు.వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలుండటం, MLAల పనితీరుపై నివేదికలు, ప్రశాంత్ కిశోర్ ఎంట్రీ, కేంద్రంతో పోరు, అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో ఈ ప్లీనరీకి ప్రాధాన్యత ఏర్పడింది.