Telangana: పనికెళితే ఆదివాసీ బాలికపై అఘాయిత్యం.. సీన్ కట్ చేస్తే.. శీలానికి వెల కట్టిన దుర్మార్గులు..

సింగరేణి ఖిల్లాలోని ఓ ఆదివాసీ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తల్లితండ్రి లేని ఓ15 ఏళ్ల ఆదివాసీ బాలిక శీలానికి అక్కడి పెద్దలు ఖరీదు కట్టారు. ఓ దుర్మార్గుడి అఘాయిత్యానికి ఓ బాలిక గర్భం దాల్చగా పెద్దలు మరో దారుణానికి ఒడిగట్టారు.. ఆ గర్బాన్ని గుట్టు చప్పుడు కాకుండా తొలగించి.. ఆ అమాయక గిరిజన బాలిక శీలానికి వెలకట్టారు. ఆ చిన్నారి తల్లి గర్భం ఖరీదు..

Telangana:  పనికెళితే ఆదివాసీ బాలికపై అఘాయిత్యం.. సీన్ కట్ చేస్తే.. శీలానికి వెల కట్టిన దుర్మార్గులు..
Rape Case

Edited By:

Updated on: Aug 20, 2023 | 9:58 AM

మంచిర్యాల, ఆగస్టు 20: సింగరేణి ఖిల్లాలోని ఓ ఆదివాసీ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తల్లితండ్రి లేని ఓ15 ఏళ్ల ఆదివాసీ బాలిక శీలానికి అక్కడి పెద్దలు ఖరీదు కట్టారు. ఓ దుర్మార్గుడి అఘాయిత్యానికి ఓ బాలిక గర్భం దాల్చగా పెద్దలు మరో దారుణానికి ఒడిగట్టారు.. ఆ గర్బాన్ని గుట్టు చప్పుడు కాకుండా తొలగించి.. ఆ అమాయక గిరిజన బాలిక శీలానికి వెలకట్టారు. ఆ చిన్నారి తల్లి గర్భం ఖరీదు రూ.2 లక్షలుగా తెలుస్తోంది. ఈ అమానుష ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఇంట్లో ఇంటి పని చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ బాలికను అదే ఇంటి యజమాని మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. మాయమాటలు చెబుతూ ఆమెపై పలు మార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో సదరు బాలిక మూడు నెలల క్రిత గర్బం దాల్చడంతో.. ఈ విషయం బయటకి పొక్కకుండా ఆ బాలిక గర్బాన్ని తొలగించేందుకు స్థానిక గ్రామ పెద్దలు రేటు కట్టినట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి. తల్లిదండ్రులు లేకపోవడంతో అనాధగా అమ్మమ్మ వద్ద ఉంటున్న ఆ బాలికను భయపెట్టి జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గర్బం తొలగించినట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక తల్లిదండ్రులిద్దరూ.. ఆమె చిన్నప్పుడే మృతి చెందారు. దీంతో ఆ బాలిక అమ్మమ్మ వద్దే ఉంటోంది. బతుకు దెరువు కోసం పక్కనే ఉన్న ఓ గ్రామంలోని ఓ వ్యాపారి ఇంట్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే, ఆ బాలికను మాయ మాటలు చెప్పి సదరు యజమాని లోబర్చుకుని.. గర్భవతిని చేశాడు. ఈ విషయం బయటకి పొక్కడంతో అదే గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి, ఓ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఆ యజమానిని బెదిరించి రూ.రెండు లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

అనంతరం, ఆ బాలికను మంచిర్యాల జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఆమె గర్భం తీయించినట్టు పేర్కొంటున్నారు. స్థానికులకు ఈ విషయం తెలియడంతో ఆ వ్యాపారికి ఇందులో ఎలాంటి సంబంధం లేదని ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు ఓ బాండ్ పేపర్ తీసుకొచ్చి గ్రామస్థుల సమక్షంలో బాలిక కుటుంబ సభ్యులతో సంతకాలు చేయించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే స్థానికులు నిలదీయడంతో ఆ ప్రజాప్రతినిధులు అక్కడి నుంచి పరారయ్యారని సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటికీ తమకెలాంటి‌ సమాచారం రాలేదని.. ఫిర్యాదు కూడా అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు. ప్రజాప్రతినిధులను‌ నిలదీసిన స్థానికులు సైతం చివరికి మౌనం దాల్చడంతో పలు అనుమానాలు తెర మీదకొస్తున్నాయి. అయితే, ఫిర్యాదు అందితే.. వెంటనే దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.