హవ్వా.. ఏకంగా పోలీస్ వాహనాల ఫాస్టాగ్ స్టిక్కర్ల చోరీ.. ఎవరో తెలిసి పోలీసులే షాక్!

బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన పోలీస్ వ్యవస్థే దారి తప్పితే అంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? ఏదైనా సమస్య వస్తే తీరుస్తారనే సామాన్య ప్రజలు నమ్మకం పెట్టుకున్న అధికారులే నేర ప్రవృతికి పాల్పడితే ఇక చెప్పేదేముంది? అలాంటి సంఘటనే ఇది కూడా. ఇటీవలే కానిస్టేబుల్‌గా ఉద్యోగం సంపాదించిన ఓ వ్యక్తి పోలీస్ వ్యవస్థ సిగ్గు పడేలా వ్యవహరించాడు.

హవ్వా.. ఏకంగా పోలీస్ వాహనాల ఫాస్టాగ్ స్టిక్కర్ల చోరీ.. ఎవరో తెలిసి పోలీసులే షాక్!
Trainee Constable Arrest

Edited By:

Updated on: May 20, 2025 | 3:59 PM

బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన పోలీస్ వ్యవస్థే దారి తప్పితే అంతకన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? ఏదైనా సమస్య వస్తే తీరుస్తారనే సామాన్య ప్రజలు నమ్మకం పెట్టుకున్న అధికారులే నేర ప్రవృతికి పాల్పడితే ఇక చెప్పేదేముంది? అలాంటి సంఘటనే ఇది కూడా. ఇటీవలే కానిస్టేబుల్‌గా ఉద్యోగం సంపాదించిన ఓ వ్యక్తి పోలీస్ వ్యవస్థ సిగ్గు పడేలా వ్యవహరించాడు. ఎంతో కష్టపడితే తప్ప దొరకని ఉద్యోగం, సమాజంలో గౌరవంగా నిలబడాల్సిన ఓ ప్రబుద్ధుడు ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్-శంషాబాద్ పరిధిలోని పీటీవోలో నిస్సార్ మైమద్ అనే హోంగార్డ్.. పోలీస్ వాహన డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతనికి ఇటీవలే కానిస్టేబుల్‌గా ఉద్యోగం కూడా వచ్చింది. ఎన్నో కష్టాలకు ఓర్చుకుని, నిబద్దతతో కృషి చేస్తే తప్ప దొరకదని, అలాంటి ఉద్యోగం ఎందరో ఏళ్లకు ఏళ్లు ఎదురుచూసే బాధ్యతలో ఉన్న ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలిస్తే మీకూ ఆశ్చర్యం వేయక తప్పదు. కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేసి తన భవిష్యత్తును చక్కదిద్దుకోవాల్సిన నిస్సార్ మైమద్ పోలీసు వాహనాల ఫాస్టాగ్ స్టిక్కర్‌లను దొంగిలించి క్యాబ్ డ్రైవర్‌లకు అద్దెకు ఇచ్చేవాడు. అంతేకాక ఒక్కో స్టిక్కర్‌పై నెలకు రూ.8 వేల వరకు వసూలు చేసేవాడు. వినడానికే వింతగా ఉంది కదూ..! ఈ దందా ఇప్పటిది కాదు. దాదాపు ఏడాది కాలంగా కొనసాగుతోందని పోలీసుల విచారణలో తేలింది.

ఫాస్టాగ్ స్టిక్కర్‌లను దొంగిలించి వాటిని క్యాబ్ డ్రైవర్‌లకు అద్దెకు ఇచ్చుకుంటూ ఎంత కొంత కూడబెట్టుకుంటున్నాడు ఈ ప్రబుద్ధుడు. ఏదైనా అవినీతి జరిగితే చొరవ తీసుకుని తక్షణ చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ కానిస్టేబులే ఇలా వ్యవహరించడంతో ఈ విషయం అంతటా తొందరగా పాకిపోయింది. గత కొన్ని నెలలుగా ఫాస్టాగ్ స్టిక్కర్‌ల దొంగతనం జరుగుతుందని గ్రహించిన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అనేక విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. ఈ దందా వెనుక సామాన్య ప్రజలు కాదు.. పోలీస్ వ్యవస్థకు చెందిన వ్యక్తే కావడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది.

ఫాస్టాగ్ స్టిక్కర్‌లను దొంగిలించి క్యాబ్ డ్రైవర్‌లకు అద్దెకు ఇచ్చి వ్యాపారం చేసుకుంటోంది కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న నిస్సార్ మైమద్ అనే వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారం ఎప్పటి నుంచి సాగుతోంది.. అసలు ఎలా మొదలైందనే విషయాలపై శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఫాస్టాగ్ స్టిక్కర్‌లను గుర్తించిన మూడు క్యాబ్‌లను సీజ్ చేసి నిందితుడు నిస్సార్ మైమద్‌ను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..