
చిన్న మటన్ ముక్క ఆ వ్యక్తి పాలిట శాపమైంది. బంధువుల ఇంటికి పండుగకు వెళ్ళిన ఆ వ్యక్తి మటన్ ముక్క గొంతులో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ ఇంట్లో నిర్వహించుకున్న దుర్గమ్మ వేడుకలు ఊహించని విధంగా విషాదం అయ్యాయి.
ఈ విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కొత్తతండాలో జరిగింది. గొంతులో మటన్ ముక్క ఇరుక్కొని లక్ష్మణ్ అనే వ్యక్తి మృతి చెందాడు. లక్ష్మణ్ అనే పెద్దాయన తన కుటుంబసభ్యులతో కలిసి కొత్తతండాలో బందువుల ఇంట్లో దుర్గమ్మ పండుగ వేడుకలకు హాజరయ్యాడు.. బంధువులతో కలిసి దావత్ చేసుకుంటున్న క్రమంలో గొంతులో మటన్ ముక్క ఇరుక్కొని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.. ఊపిరి ఆడక అవస్థ పడుతున్న లక్ష్మణ్‌ను కుటుంబ సభ్యులు వెంటనే మరిపెడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు..
ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలోనే మార్గ మధ్యలోనే లక్ష్మణ్ మృతి చెందాడు.. మృతుడు వర్ధన్నపేట మండలం బండాతండాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.. దుర్గమ్మ పండుగ విషాదంగా మారడంతో కుటుంబసభ్యులు అంతా బోరున విలపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.