పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

Jagtial News: ఉపాధి కోసం మాల్టా వెళ్లిన జగిత్యాలకు చెందిన 27 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పెళ్లైన కేవలం మూడు నెలలకే ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి త్వరగా తీసుకురావాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాలను కోరుతున్నారు.

పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి
Malta Road Accident

Edited By:

Updated on: Aug 12, 2026 | 10:50 AM

పెళ్లయిన.. మూడు నెలలకే విగత జీవిగా మారిపోయాడు.. ఎన్నో ఆశలతో యూరప్ బాట పడితే.. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో అతని స్వగ్రామం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో విషాదం నెలకొంది. ఉపాధి కోసం యూరప్‌లోని మాల్టాకు వెళ్లిన జగిత్యాల పట్టణానికి చెందిన 27 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటనతో జగిత్యాలలోని ఇస్లాంపురా ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇస్లాంపురాకు చెందిన మహమ్మద్ ముజహిద్ కుమారుడు మహమ్మద్ జావిద్ (27) యూరప్ మాల్టాలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కారులో ప్రయాణిస్తుండగా ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో జావిద్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. జావిద్ సుమారు ఏడాదిన్నర క్రితం ఉద్యోగం కోసం యూరప్‌లోని మాల్టాకు వెళ్లాడు. మూడు నెలల క్రితం స్వదేశానికి తిరిగి వచ్చి వివాహం చేసుకుని తిరిగి మాల్టాకు వెళ్లాడు. వివాహమైన కేవలం మూడు నెలలకే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.. డెడ్ బాడీని త్వరగా సగ్రామానికి తెప్పించాలని కుటుంబ సభ్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us