Revanth Reddy: కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. ఆరు గ్యారెంటీలతో పాటూ మరిన్ని సంక్షేమ పథకాలు..

|

Nov 23, 2023 | 2:52 PM

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దుబ్బాక వేదికగా జరిగిన విజయభేరి సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే దుబ్బాక అభివృద్ది జరిగిందన్నారు. చెరుకు ముత్యం రెడ్డి దుబ్బాకను అభివృద్ది చేశారన్నారు. తమకు అధికారం ఇస్తే.. ఆరు గ్యారెంటీలతో పాటూ మిగిలిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు.

Revanth Reddy: కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. ఆరు గ్యారెంటీలతో పాటూ మరిన్ని సంక్షేమ పథకాలు..
Revanth Reddy
Follow us on

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దుబ్బాక వేదికగా జరిగిన విజయభేరి సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే దుబ్బాక అభివృద్ది జరిగిందన్నారు. చెరుకు ముత్యం రెడ్డి దుబ్బాకను అభివృద్ది చేశారన్నారు. తమకు అధికారం ఇస్తే.. ఆరు గ్యారెంటీలతో పాటూ మిగిలిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ఇప్పటికే కర్ణాటకలో చెప్పిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. వ్యవసాయానికి 24గంటలు ఉచిత కరెంట్ ఇస్తామని వాగ్ధానం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది ఇందిరమ్మ రాజ్యం తెస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీలను కూడా  కాంగ్రెస్ ప్రభుత్వమే ఆదుకుంటుందన్నారు. రైతు భరోసా కింద ఏడాదికి 15వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. తమ మ్యానిఫెస్టో అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చేలా ఉందని తెలిపారు. మహిళలు, విద్యార్థులు, వృద్దులు, యువతకు మంచి చేయడమే తమ ఎజెండా అన్నారు. గృహిణులకు వంట గ్యాస్ ను రూ. 400 కే అందిస్తామన్నారు. రఘునందన్ రావు, కొత్త ప్రభాకర్ వీరిద్దరి పాలనను చూసిన నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..