Revanth Reddy: ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడదాం.. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పాలనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రగతి భవన్ తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిందన్న ఆయన.. ప్రజా దర్బార్ నిర్వహించడానికే ప్రగతి..

Revanth Reddy: ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడదాం.. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..
Revanth Reddy

Updated on: Feb 08, 2023 | 7:22 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పాలనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రగతి భవన్ తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిందన్న ఆయన.. ప్రజా దర్బార్ నిర్వహించడానికే ప్రగతి భవన్ ఉండాలి కానీ..పాలన చేసేందుకు కాదని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ప్రజలను కలవలేదా అని ప్రశ్నించారు. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడదామని ప్రజలకు పిలుపునిస్తున్నానని తెలిపారు. అవసరమైతే ప్రగతి భవన్ ను నేలమట్టం చేసే బాధ్యత తామే తీసుకుంటామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ద్రోహులకు, తన బంధువులకు మంత్రి పదవులు ఇవ్వాలని నక్సలైట్ల ఎజెండాలో ఉందా అని నిలదీశారు రేవంత్ రెడ్డి. నిరంకుశ పాలన నుంచి శాశ్వత పరిష్కారం కోసం తుది దశ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

మేం గాంధీ వారసులం. హింసకు వ్యతిరేకం. శాంతి కోసమే ఈ యాత్ర. తెలంగాణ వచ్చాక ఎన్ కౌంటర్ లు ఉండవని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రం వచ్చాక జరిగిన ఎన్ కౌంటర్లకు కేసీఆర్ ఏం సమాధానం చెబుతారు. 9 నెలల్లో ప్రగతి భవన్, 12 నెలల్లో సచివాలయం కట్టారు. కానీ 9 ఏళ్లలో అమరుల స్థూపం కట్టలేకపోయారు. వృథా ఖర్చులు తగ్గిస్తే రాష్ట్రం మిగులు బడ్జెట్ లోకి వెళుతుంది. నాకు కేసులు కొత్త కాదు. నా పైన ఇప్పటికే వందకు పైగా కేసులు ఉన్నాయి. జైలుకు కూడా పోయి వచ్చినా. భయపడే వాళ్లు దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకోవాలి.

– రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి

గతంలో నక్సలైట్లు గడీలను గ్రానైడ్లతో పేల్చేసినట్టు.. ప్రగతి భవన్ ను సైతం పేల్చేయాలని పిలుపునిచ్చారు. కాగా.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. డీజీపీని కలిసి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా అంతే దీటుగా సమాధానం ఇస్తున్నారు. ప్రాజెక్టులు పేల్చేస్తామంటే తప్పులేదు కానీ.. ప్రగతిభవన్ పేల్చేయాలంటే తప్పా అని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం