Revanth Reddy Security: కోర్టు నిర్ణయం రాకుండానే ఇదేం పని.. సెక్యూరిటీని తొలగింపు రేవంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy Security Removed: టీపీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బందిని ప్రభుత్వం తొలగించింది. సెక్యూరిటీ లేకుండానే ఆయన ప్రజల్లోకి వెళుతున్నారు. బుధవారం నుంచి రేవంత్‌ చూట్టు గన్‌మెన్లు కనిపించడం లేదని సమాచారం. అయితే, గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశంలో మహబూబ్‌నగర్‌ పోలీసుల్నీ ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రెడ్‌ డైరీలో మీ పేర్లు రాసి పెడతా.. 100 రోజుల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి గుడ్డలిప్పదీస్తాం.. అసలు మిత్తితోని చెల్లిస్తామని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది.

Revanth Reddy Security: కోర్టు నిర్ణయం రాకుండానే ఇదేం పని.. సెక్యూరిటీని తొలగింపు రేవంత్ రెడ్డి ఫైర్
TPCC President Revanth Reddy

Updated on: Aug 17, 2023 | 9:44 PM

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రేవంత్ సెక్యూరిటీని ప్రభుత్వం తగ్గించింది. ఇటీవల 4+4 భద్రతను 2+2కు ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు భద్రతను 1+1 కు మరోసారి ప్రభుత్వం కుడించింది. రేవంత్ భద్రత కుదింపు విషయం అయిన వర్గం విస్మయం చెందింది.రాజకీయ వర్గాల్లో కుడు ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. రెండు నెలల క్రితం తనకు భద్రత కల్పించాలని కోర్టులో పిటిషన్ వేశారు రేవంత్ రెడ్డి. కోర్ట్ ఎలాంటి డైరెక్షన్ ఇవ్వకముందే ప్రభుత్వం ఇలా చేయడం పై రేవంత్ సీరియస్ అయ్యారు. ఉన్న 1+1 సెక్యూరిటీ కూడా వద్దని ఈరోజు తిరిగి ఉదయం నుంచి సెక్యూరిటీ లేకుండానే రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు.

ఎలాంటి కారణాలు లేకుండానే తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గన్ మెన్లను తొలగించడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. గతంలో తన భద్రత పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా అనేక వినదులు చేశారు రేవంత్ రెడ్డి కానీ కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించలేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం