Telangana: నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు..

|

Apr 16, 2024 | 9:05 AM

సభకు గులాబీ బాస్‌ కేసీఆర్ ముఖ్య అతిథిగా‌ హాజరవుతారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. మరోవైపు సభా స్థలిని ఇప్పటికే హరీష్ రావు, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కూడా పరిశీలించారు. అలాగే.... సభకు సుమారు లక్ష మందిని సమీకరించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల...

Telangana: నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు..
BRS
Follow us on

అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతుంది. ఈసారి రెండంకెల స్థానాల్లో విజయం సాధించి అధికారపక్షానికి షాక్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కరీంనగర్ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరించిన బీఆర్ఎస్..ఇవాళ ఉమ్మడి మెదక్‌ జిల్లా జోగిపేటలో మరో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది.

సభకు గులాబీ బాస్‌ కేసీఆర్ ముఖ్య అతిథిగా‌ హాజరవుతారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. మరోవైపు సభా స్థలిని ఇప్పటికే హరీష్ రావు, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కూడా పరిశీలించారు. అలాగే…. సభకు సుమారు లక్ష మందిని సమీకరించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల శంఖారావంలో భాగంగా జహీరాబాద్, మెదక్ పార్లమెంట్లకు సంయుక్తంగా జోగిపేట సమీపంలో ఈ బహిరంగ సభ జరగనుంది.

కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి నేరుగా బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. కాగా మెదక్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జహీరాబాద్‌ నుంచి గాలి అనిల్‌ కుమార్‌ పోటీలో ఉన్నారు. వీళ్ల తరుపున ఓట్లను అభ్యర్ధించనున్నారు కేసీఆర్‌. అలాగే ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి జంప్‌ అయ్యి బీజేపీ తరుపున జహీరాబాద్‌ నుంచి పోటీ చేస్తున్న బీబీపాటిల్‌ను కేసీఆర్‌ టార్గెట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పలువురు కీలక నేతలు సైతం ఈ బహిరంగ సభకు హాజరవుతారు. మొత్తంగా… జహీరాబాద్‌ ఎంపీ సీటుపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు గులాబీ బాస్. పార్టీ నుంచి జంపైన బీబీపాటిల్‌కు సరైన గుణపాఠం చెప్పాలన్న లక్ష్యంతో ఉన్నారు. మరి కేసీఆర్‌ వ్యూహాలు ఏమేర ఫలిస్తాయో తెలియాలంటే ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..