Weather Alert: ఈరోజు, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షం..

దేశంలోని పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అక్కడక్కడ వానలు పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు, రేపు పలు జిల్లాలో భారీ వర్షం పడే అవకాశం ఉందని సూచించింది.

Weather Alert: ఈరోజు, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షం..
Rain Alert
Follow us
Aravind B

|

Updated on: Jul 04, 2023 | 7:32 AM

దేశంలోని పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అక్కడక్కడ వానలు పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు, రేపు పలు జిల్లాలో భారీ వర్షం పడే అవకాశం ఉందని సూచించింది. దాదాపు 19 జిల్లాలకు ఈ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది., ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, జగిత్యాల సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.

అలాగే నాగర్ కర్నూల్, వనపర్తి సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని ఇటీవల కురిసిన వానలకు రోడ్లన్ని జలమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో చాలా ప్రాంతాల్లో వాహనాదారులు  ట్రాఫిక్ ఇబ్బందులు పడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..