Man Eater Come Back : అడవి జిల్లాలో అలజడి.. మరోసారి ఎంట్రీ ఇచ్చిన మ్యాన్ ఈటర్.. హడలిపోతున్న ఆదివాసీ గ్రామాలు..

|

Feb 03, 2021 | 5:27 PM

మహారాష్ట్ర సరిహద్దుల్లోని పెంచికల్‌పేట మండలం కమ్మర్‌గాం అడవుల్లో సంచరిస్తున్న పులి మూడు పశువుల మీద దాడి చేసింది. దిగిడ లోహా రాంపూర్ అటవి ప్రాంతంలో సంచరిస్తుండటంతో...

Man Eater Come Back : అడవి జిల్లాలో అలజడి.. మరోసారి ఎంట్రీ ఇచ్చిన మ్యాన్ ఈటర్.. హడలిపోతున్న ఆదివాసీ గ్రామాలు..
Follow us on

Man Eater Come Back : మ్యాన్ ఈటర్ టెన్షన్ మళ్లీ మొదలెట్టింది. కొద్ది రోజులు కనిపించడకుండా పోయిన పులి .. మరోసారి పంజా విసిరింది. రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో వడలెత్తించి కనిపించకుండా పోయిన పులి.. అడవి జిల్లాలోకి మరోసారి ఎంట్రీ ఇచ్చింది.

ఎంట్రీ ఇవ్వడంతోనే దాడి మొదలు పెట్టింది. మహారాష్ట్ర సరిహద్దుల్లోని పెంచికల్‌పేట మండలం కమ్మర్‌గాం అడవుల్లో సంచరిస్తున్న పులి మూడు పశువుల మీద దాడి చేసింది. దిగిడ లోహా రాంపూర్ అటవి ప్రాంతంలో సంచరిస్తుండటంతో 35 గ్రామాల్లో టెన్షన్ వాతవరణం నెలకొంది.

ఇక మ్యాన్ ఈటర్ సంచారంతో కొమురంభీం జిల్లా విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణలో సోమవారం నుంచి బడి గంట మోగడంతో.. విద్యార్థులు బడి బాట పట్టారు. అయితే ఇంటి నుంచి వెళ్లిన తమ పిల్లలు తిరిగి వచ్చేవరకు తమకు ఆందోళనగా ఉందని తల్లిదండ్రులు అంటున్నారు. పెంచికల్ పేట, దహేగాం , బెజ్జూర్ పరిధిలో పులి భయంతో తొలి రోజు 350 విద్యార్థులు బడికి వెళ్లలేదు.

పులి సంచారంతో తమ పిల్లల భవిష్యత్ ఏం అయిపోతుందో అంటూ తల్లిదండ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు‌. పులితో ప్రాణహాని ఉందంటూ ఇటు ఉపాద్యాయులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..