Hyderabad: ఎన్టీఆర్ గార్డెన్ ఘటనలో ముగ్గురిపై వేటు.. క్లాక్ రూమ్ నిర్వాహకులకు జరిమానా

| Edited By: Aravind B

Jul 11, 2023 | 10:01 PM

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గార్డెన్ లో క్లాక్ రూమ్ నిర్వాహకులు, సెక్యూరిటీ దురుసుగా ప్రవర్తించారని సోషల్ మీడియాలో, కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‎మెంట్ అథారిటీ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంది.

Hyderabad: ఎన్టీఆర్ గార్డెన్ ఘటనలో ముగ్గురిపై వేటు.. క్లాక్ రూమ్ నిర్వాహకులకు జరిమానా
Ntr Gardens
Follow us on

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గార్డెన్ లో క్లాక్ రూమ్ నిర్వాహకులు, సెక్యూరిటీ దురుసుగా ప్రవర్తించారని సోషల్ మీడియాలో, కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‎మెంట్ అథారిటీ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంది. మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ ఓఎస్డి చంద్రారెడ్డి ఎన్టీఆర్ గార్డెన్ సందర్శించి ఘటన తీరును విచారించారు. ఈ సందర్భంగా దీనిపై ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఇక్బాల్ హుస్సేన్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విచారణ అనంతరం బాధ్యురాలిగా గుర్తించిన మహిళ సెక్యూరిటీ సిబ్బందితో పాటు క్లాక్ రూమ్ లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే క్లాక్ రూమ్ నిర్వాహకులకు రూ. 2,500లు పెనాల్టీ విధించారు. అలాగే హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అన్ని పార్కుల్లో సేవలకు సంబంధించిన ఫీజులపై డిస్ప్లే బోర్డులు సైతం ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఎన్టీఆర్ గార్డెన్ క్లాక్ రూమ్ ఘటన అంశంపై పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్ ఎస్. శ్రీనివాస్ కు అలాగే బిపీపీ ఓఎస్డి చంద్రారెడ్డి షో కాజ్ నోటీసు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..