
మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. జైపూర్ మండలం ఇందారం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 11 మందికి గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
బొలొరో డ్రైవర్ కాలకృత్యాల కోసం రోడ్డు ప్రక్కన వాహనాన్ని ఆపడంతో వెనక నుండి బలంగా ఢికొట్టింది లారీ. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ప్రమాదానికి సంబంధించిన స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే మృతులు మహారాష్ట్రకు చెందిన కూలీలుగా గుర్తించారు పోలీసులు. మహారాష్ట్ర నుంచి 23 మంది కూలీలతో బొలొరో వాహనంలో కరీంనగర్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..