
పొలంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడి ఇద్దరు మహిళలు, ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అయిజ మండలం భూంపురం గ్రామానికి చెందిన పార్వతమ్మ (22), సర్వేశ్ (20), సౌభాగ్యమ్మ అనే రైతులు పత్తి చేనులో పని నిమిత్తం పొలానికి వెళ్లారు. ఉదయం నుంచి పొలంలో పత్తి తీస్తూ ఉన్నారు. అయితే సాయంత్రం కాగానే ఒక్కసారిగా పొలంలో పనిచేస్తున్న కూలీలపై పిగుడు పడింది. ఈ ప్రమాదంలో పార్వతమ్మ, సౌభాగ్యమ్మతో పాటు సర్వేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు కూళీలు తీవ్రంగా గాయపడ్డారు.
అయితే పిడుగు పడ్డ శబ్ధానికి పక్క పొలంలో ఉన్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ముగ్గురు కూళీలు చనిపోవడం చూసి షాక్ అయ్యారు. వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి గాయపడిన వారిని గద్వాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు వెంటనే వారికి వైద్యం అందించారు. ప్రస్తుతం వారు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కొసం ఇక్కడ క్లిక్ చేయండి.