Weather Update: ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం విచిత్రంగా మారింది. ఓవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి.. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇంకోవైపు బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడనుంది.. అలాగే ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
ఇది కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తా జిల్లాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. బుధ, గురువారాల్లో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. శుక్రవారం నాడు ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వర్షపాతం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తీర ప్రాంతాల్లో గురువారం గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Apple Event: యాపిల్ కావాలా నాయనా
భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..?
ఎయిర్‌పోర్ట్ అధికారుల చేతివాటం బ్యాటరీలు, నూనె దొంగిలించి..
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

