
జగిత్యాల, ఆగస్ట్ 31: రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత కొంత కాలంగా వరుస దొంగతనాలతో కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఓ బట్టల వ్యాపారి ఇంట్లో దొంగలు చోరీ చేశారు. ఎప్పటి మాదిరి గానే ఉదయం ఇంటికి తాళం వేసి బట్టల దుఖాణంకి వెళ్లిన వ్యాపారి ఇంటిని గుట్టు చప్పుడు కాకుండా దొంగలు దోచుకున్నారు. ఈ షాకింగ్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అసలేం జరిగిందంటే..
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఆంగ్లో వేదిక్ పాఠశాల వీధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. బట్టల వ్యాపారి ఇంట్లో తాళం పగులగొట్టి ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. ఆనక బంగారు నగలు, దుస్తులు అపహరించి తీసుకెల్లినట్టు పోలీసులు తెలిపారు. యజమాని ఇంటికి తాళం వేసి యధావిధిగా బట్టల షాపుకు వెళ్ళాడు. రాత్రి వేళలో తిరిగి ఇంటికి రాగా.. ఇంటి డోర్‌కు వేసిన తాళం పగిలిపోయి ఉండటం చూసి ఖంగు తిన్నారు. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరుగా తీసి ఉంది.
అందులో ఉంచిన నగలు, దుస్తులు చోరీ జరిగినట్టు గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు. సుమారు 7 తులాల బంగారం, కొంత నగదు దొంగలించినట్లు ఇంటి యజమాని ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.https://tv9telugu.com/telangana
1615911,1615953,1615945,1615972