బకెట్లు, బిందెలతో రోడ్లపైకి వచ్చిన స్థానికులు.. అసలు కారణం ఇదే..

|

Mar 09, 2024 | 4:27 PM

వేసవి మొదలుకాక ముందే తాగునీరు కరువైంది. తెలంగాణలోని ఖమ్మం, నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో తాగునీరు లేక జనం బిందెలు, బకెట్లు పట్టుకుని రోడ్లపైకి వస్తున్నారు. ఎండాకాలం ప్రారంభమైంది. ఇంకా మధ్యకు చేరుకోలేదు. అప్పుడే తాగునీటి కొరత ఏర్పడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టుల్లో నీరు ఇంకిపోయాయి. కొన్ని చోట్ల అయితే రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటిపోయాయి.

బకెట్లు, బిందెలతో రోడ్లపైకి వచ్చిన స్థానికులు.. అసలు కారణం ఇదే..
Telangana Water
Follow us on

వేసవి మొదలుకాక ముందే తాగునీరు కరువైంది. తెలంగాణలోని ఖమ్మం, నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో తాగునీరు లేక జనం బిందెలు, బకెట్లు పట్టుకుని రోడ్లపైకి వస్తున్నారు. ఎండాకాలం ప్రారంభమైంది. ఇంకా మధ్యకు చేరుకోలేదు. అప్పుడే తాగునీటి కొరత ఏర్పడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టుల్లో నీరు ఇంకిపోయాయి. కొన్ని చోట్ల అయితే రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. దీంతో తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఉదయం 10 గంటలు దాటితే సూర్యుడు నడినెత్తిమీదకు వస్తున్నాడు.

దీంతో దాహార్తిని తీర్చుకునేందుకు గుక్కెడు మంచి నీళ్లు తాగుదామంటే ఖాళీ బిందెలు దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఖమ్మంజిల్లా పెనుబల్లి మండలం లింగగూడెం ఏజెన్సీ ప్రాంతంలో తాగునీరు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఐదు రోజులుగా తాగునీరు లేకపోవడంతో మహిళలు ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. తాగేనీరు లేక ఇబ్బందిపడుతున్నామని, వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని రోడ్డుపై నిరసన చేపట్టారు.

ఈ సమస్య కేవలం ఒక ప్రాంతానికో, ఒక జిల్లాకో సంబంధించింది కాదు. యావత్ తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అటు నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో మంచీనీరు రాక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. తాగునీటి కొరతతో ట్యాంకర్ల ద్వారా మంచి నీటిని సరపరా చేస్తున్నారు. అయితే మూడు రోజులుగా మంచి నీళ్లు లేవని.. మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో రోడ్డుపై మహిళలు బైఠాయించారు. నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తాగునీటికే ఇలా ఉంటే ఇక సాగుకు నీటిని ఎలా ఏర్పాటు చేయాలన్న దానిపై అధికారులు తర్జనభర్జనపడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఇలాంటి గడ్డు పరిస్థితులు తలెత్తితే రానున్న ఏప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..