గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షం పడిందంటే ట్రాఫిక్ షరా మామూలే. చిన్న వర్షానికి నగర రోడ్లు నదులను తలపిస్తే, పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ ను ఛేదించడం మామూలు విషయం కాదు. అరగంట జర్నీ రెండు మూడు గంటలు పట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. నగరంలో వాటర్ స్టాగ్నెట్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? ఈ ట్రాఫిక్ చిక్కులు వీడే మార్గమే లేదా ..? గమ్యం సాఫీగా చేరే దారే లేదా..? అన్నదీ సగటు భాగ్యనగరవాసుడి ప్రశ్న.. !
భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తిన వేళ నగరవాసుల ఇక్కట్లు అన్ని కావు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు ట్రాఫిక్ అష్ట దిగ్బంధనం నగరంలో ప్రధాన సమస్య. సరిగ్గా సాయంత్రం వేళ అకాల వర్షాలు అతలాకుతల చేస్తుంటే ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు ఉద్యోగులు అష్ట కష్టాలు పడాల్సిన వస్తుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రధాన రహదారులపైనే వాటర్ స్టాగ్నెట్ అవ్వడంతో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. మే 16వ తేదీ గురువారం నగరంలో సరాసరి 7 సెంటీమీటర్లకు పైగా అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
హైదరాబాద్ మహా నగరంలో గతేడాది గుర్తించిన 339 వాటర్ లాగిన్ పాయింట్స్ అన్నీ కూడా నీటితో నిండి పోయాయి. ముఖ్యంగా ఈ బ్లాక్ పాయింట్స్ మెయిన్ రోడ్లపై ఉన్న ప్రాంతలు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద, లింగంపల్లి రైల్వే అండర్ పాస్, యూసఫ్ గూడా మెయిన్ రోడ్, రాజ్ భవన్ రోడ్, ఫిల్మ్ నగర్, మూసాపేట్ మెట్రో స్టేషన్, బాలానగర్ బస్ స్టాప్, చింతల్ రోడ్, జీడిమెట్ల హై టెన్సన్ రోడ్, మలక్ పేట సహా పాతబస్తీలో పలు ఏరియాల్లో నీరు నిలిచి డేంజర్ స్పాట్స్‌గా ఉన్నాయి.
భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమై డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్, మాన్‌సూన్ టీమ్స్ రంగలోకి దిగుతాయి. గ్రేటర్ పరిధిలో 30 DRF టీమ్స్, 60 CRMP మేంటెన్స్ టీమ్స్ గ్రౌండ్ లెవెల్ లో సహాయక చర్యలు చేపడుతున్నాయి. అదే రేయిని సీజన్ అయితే ఎమర్జెన్సీ జిహెచ్ఎంసి మాన్ సూన్ టీమ్స్ ను రెడీ చేస్తారు. ఈ బృందాలు ఎక్కడ వాటర్ నిలిచిన క్లియర్ చేయడం, చెట్లు విరిగిపడిపోయినా సహాయక చర్యలు అందించేలా పనిచేయనున్నాయి.
:అకాల వర్షాలు సాయంత్రం వేళ విరుచుకుపడుతూ ఉండడంతో ఉద్యోగులు వెళ్లే పిక్ అవర్స్ లో ట్రాఫిక్ నరకయాతన చూపిస్తోంది.సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆఫీసులో నుంచి ఇళ్లకు బయటకు వచ్చిన వారు ట్రాఫిక్ లోనే చిక్కుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో చినుకు పడితే ట్రాఫిక్ చిక్కులు ఎంతలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, చార్మినార్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నచోట ఇప్పటికే బల్దియా అధికారులు భారీ వర్షాలు కురిసే ముందు ముందస్తుగానే వర్షం ప్రభావాన్ని చూసుకుని ఉద్యోగులు బయటకు రావాలని సూచనలు జారీ చేస్తున్నారు. కంపెనీలు సైతం షిప్టులను అందుకు తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోవాలని సలహా ఇచ్చినప్పటికీ షిఫ్ట్ అవగానే ఉద్యోగులు ఒకేసారి రోడ్ల మీదకి రావడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి నానా తిప్పలు పడుతున్నారు.
చినుకు పడిన ప్రతిసారి నగరం అష్టదిగ్బంధనంలో కురుకుపోకుండా గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద నాలాల విస్తరణ, నీరు నిలవకుండా వెంటనే తొలగించేలా బల్దియా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దానికి తోడు ఎక్కడికక్కడ ట్రాఫిక్ సిబ్బంది సైతం ట్రాఫిక్ రెగ్యులేటింగ్ చేసే విధంగా అవసరమైతే వన్ వే దారులు డైవర్ట్ చేసే చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నగరంలో వర్షం పడిందంటే ట్రాఫిక్ షరా మామూలుగా మారిన వేల తక్షణ నివారణ చర్యలు అవసరమని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…