IT Corridor: పోచారం IT కారిడార్‌లో దొంగతనం.. బాయ్స్ హాస్టల్‌లో ల్యాప్‌టాప్, మొబైల్స్ మాయం!

Pocharam IT Corridor: పోచారం IT కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ బాయ్స్ హాస్టల్‌లో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. హాస్టల్ నివాసి జీవన్ (పేరు మార్చాము) గదిలో ఉంచిన తన ల్యాప్‌టాప్‌తో పాటు రెండు మొబైల్ ఫోన్‌లు మాయమయ్యాయి..

IT Corridor: పోచారం IT కారిడార్‌లో దొంగతనం.. బాయ్స్ హాస్టల్‌లో ల్యాప్‌టాప్, మొబైల్స్ మాయం!
Theft

Edited By:

Updated on: Mar 20, 2026 | 9:23 PM

Pocharam IT Corridor: తెలంగాణ IT హబ్‌గా పేరుగాంచిన పోచారం ప్రాంతంలో భద్రతా లోపాలు బహిర్గతమవుతున్నాయి. యంనంపేట్‌లోని ఒక ప్రైవేట్ బాయ్స్ హాస్టల్‌లో ల్యాప్‌టాప్‌తో పాటు రెండు హై-ఎండ్ మొబైల్ ఫోన్‌లు చోరీ జరిగాయి. వాటి మొత్తం విలువ సుమారు లక్ష రూపాయలు ఉండవచ్చని అంచనా. అయితే ఈ చోరీ ఘటనలు విద్యార్థుల్లో భయం రేపుతున్నాయి. అంతేకాకుండా వారు రాత్రుల్లో నిద్రకు దూరమవుతున్నారు.

పోచారం IT కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ బాయ్స్ హాస్టల్‌లో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. హాస్టల్ నివాసి జీవన్ (పేరు మార్చాము) గదిలో ఉంచిన తన ల్యాప్‌టాప్‌తో పాటు రెండు మొబైల్ ఫోన్‌లు మాయమయ్యాయి. “రాత్రి 2 గంటల సమయంలో దొంగలు లాక్‌లు బ్రేక్ చేసి లోపలికి వచ్చారు. రోజువారీ పనులకు ఉపయోగపడే గాడ్జెట్లు పోయాయి” అంటూ బాధితుడు జీవన్ తెలిపారు. ఈ ఘటన ఇతర విద్యార్థుల్లో కూడా భయాన్ని కలిగించింది. దీంతో దొంగల భయంతో రాత్రుల్లో నిద్రపోకుండా ఉండాల్సిన వస్తోందని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.

పోలీల దర్యాప్తు:

బాధితుడు జీవన్ పిర్యాదు మేరకు పోచారం IT కారిడార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సీన్ ఆఫ్ క్రైమ్‌ను పరిశీలించిన పోలీసులు, సిసిటివి ఫుటేజ్‌లను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఫుటేజ్‌లో ఆరుములు కనిపిస్తున్నాయి. దగ్గరి ప్రాంతాల్లో దొంగల గ్యాంగ్‌లపై దృష్టి పెడుతున్నాం. త్వరలో నిందితులను పట్టుకుంటాం అని పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్ తెలిపారు. హాస్టల్ మేనేజ్‌మెంట్‌కు కూడా భద్రతా సూచనలు జారీ చేశారు.

పోచారం IT కారిడార్ ప్రాంతంలో వేలాది మంది IT ఉద్యోగులు, విద్యార్థులు హాస్టళ్లలో నివసిస్తున్నారు. గత కొన్ని నెలల్లో ఇలాంటి దొంగతనాలు పెరిగాయి. హై-టెక్ గ్యాడ్జెట్లు లక్ష్యంగా చేసుకుని దొంగలు చురుకుగా ఉన్నారు. విద్యార్థులు, హాస్టల్ యాజమాన్యాలు ఇప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. స్థానికులు పోలీస్ పెట్రాలింగ్ పెంచాలి. CCTVలు మెరుగుపరచాలి అని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

 

Follow Us