Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్‌డేట్.. నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు..!

| Edited By: Balaraju Goud

Feb 14, 2025 | 5:09 PM

రాధాకిషన్‌రావుకు హైకోర్టు, తిరుపతన్నకు సుప్రీంకోర్టు కండీషన్ బెయిల్‌ ఇచ్చిందని.. ఈ క్రమంలో సంవత్సర కాలంగా చంచల్‌గూడా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ప్రణీత్‌రావుకు కండిషన్ బెయిల్ ఇవ్వాలని కోరడంతో.. వాదనలను పరిగణనలోకి తీసుకుని కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ అప్‌డేట్.. నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు..!
Phone Tapping Case
Follow us on

ఫోన్ ట్యాపింగ్ కేసులో లేటెస్ట్ అప్‌డేట్ ఇది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన మాజీ DSP ప్రణీత్‌రావుకు బెయిల్ లభించింది. నాంపల్లి కోర్టు ఆయనకు ఫిబ్రవరి 14న బెయిల్ ఇచ్చింది. ప్రణీత్‌రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై పలు మార్లు విచారణ జరిపిన ధర్మాసనం.. తాజాగా రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది.

తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మాజీ DSP ప్రణీత్‌రావు ఏ2గా.. రిమాండ్‌ ఖైదీగా చంచల్‌గూడ జైలులోఉన్నారు. రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ప్రణీత్ రావు తరపున న్యాయవాది ఉమామహేశ్వరరావు 1వ అదనపు జిల్లా కోర్టులో వాదనల కంప్లీట్ చేశారు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ విచారణకు అందుబాటులో లేకపోవడంతో.. ఆయన వెర్షన్ కోసం జడ్జి రమాకాంత్ విచారణను గురువారానికి వాయిదా వేశారు.

గురువారం(ఫిబ్రవరి 13) పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు కూడా విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. శుక్రవారం ఉదయం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్వర్వులు ఇచ్చారు. ఇక ఈ కేసులో నిందితులుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ అదనపు SP తిరుపతన్న, ప్రభాకర రావు, భుజంగరావుకు అనారోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిల్‌ గతంలోనే పొందారు.

ప్రణీత్‌రావు తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భుజంగరావుకు బెయిల్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. మధ్యంతర బెయిల్‌ గడువును ఉన్నత న్యాయస్థానం సైతం పొడిగించదని, అనంతరం రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిందని తెలిపారు. విచారణ అవ్వలేదని పోలీసులు కౌంటర్ అఫిడివిట్‌ వేసినా.. పీపీ వాదనల్ని హైకోర్టు సమర్థించలేదని గుర్తుచేశారు. 90 రోజులు రిమాండ్‌ ఖైదీగా జైల్లో ఉన్న అనంతరం 167 CRPC కింద ప్రణీత్‌రావు దాఖలు చేసిన మ్యాండేటరీ బెయిల్‌ పిటిషన్‌ను 14వ అడిషినల్ చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్టేట్‌ కోర్టు కొట్టివేశారని తెలిపారు..

ఇక రాధాకిషన్‌రావుకు హైకోర్టు, తిరుపతన్నకు సుప్రీంకోర్టు కండీషన్ బెయిల్‌ ఇచ్చిందని.. ఈ క్రమంలో సంవత్సర కాలంగా చంచల్‌గూడా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ప్రణీత్‌రావుకు కండిషన్ బెయిల్ ఇవ్వాలని కోరడంతో.. వాదనలను పరిగణనలోకి తీసుకుని కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..