Hyderabad: నిబంధనలు ఉల్లంఘించిన హైదరాబాద్‌ ఫస్ట్ సిటిజన్.. సుమోటోగా పోలీసుల కేసు నమోదు!

|

Oct 14, 2024 | 1:12 PM

హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బతుకమ్మ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి డీజే సౌండ్స్‌ ఉపయోగించిన ఘటనలో జీహెచ్ఎంసీ మేయర్‌ విజయలక్ష్మితోపాటు మరో ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Hyderabad: నిబంధనలు ఉల్లంఘించిన హైదరాబాద్‌ ఫస్ట్ సిటిజన్.. సుమోటోగా పోలీసుల కేసు నమోదు!
Fir On Hyderabad Mayor
Follow us on

హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బతుకమ్మ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించి డీజే సౌండ్స్‌ ఉపయోగించిన ఘటనలో జీహెచ్ఎంసీ మేయర్‌ విజయలక్ష్మితోపాటు మరో ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

అక్టోబర్ 10న సద్దుల బతుకమ్మ సందర్భం గా బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12 లోని ఎన్‌బీటీ నగర్‌లో మేయర్‌ విజయలక్ష్మి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. రాత్రి 11.45 గంటల తర్వాత కూడా డీజే సౌండ్స్‌ పెట్టడంతో తల్వార్‌ పట్టుకుని ఉన్న మేయర్‌ బెదించినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. మేయర్‌ విజయలక్ష్మిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో కేసును సుమోటోగా స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మేయర్‌తోపాటు నిర్వాహకులు విజయ్‌కుమార్‌, గౌస్‌ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే, తల్వార్‌ వీడియో వైరల్‌ కావడంతో వివరణ ఇచ్చారు మేయర్‌ విజయలక్ష్మి. కొందరు ఓర్వలేక పోలీసులకు ఫిర్యాదు చేశారని మేయర్‌ విజయలక్ష్మీ మండిపడ్డారు. మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగానే మాట్లాడాను తప్పా ఎవరిని బెదిరించడానికి కాదన్నారు. బంజారాహిల్స్‌ డివిజలో ప్రజల తరపున మాట్లాడొద్దా? అని మేయర్‌ ప్రశ్నించారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఏ తప్పూ లేదని మేయర్‌ విజయలక్ష్మి సమర్థించుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..