కరెంటు తీగను పట్టుకుంటేనే కాదు. అప్పడప్పుడు కరెంట్బిల్లు స్లిప్ చూసినా షాక్కొడుతోంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక కారణాల వల్ల పూరి గుడిసెలు, రేకుల ఇళ్లల్లో నివాసముండే వ్యక్తులకూ రూ.లక్షల్లో బిల్లులు వస్తున్నాయి. ఆ బిల్లులు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ కుటుంబానికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఓ ఫ్యాన్, టీవీ, రెండు బల్బులు ఉన్న ఆ ఇంటికి ఏకంగా రూ 7.2 లక్షల విద్యుత్ బిల్లు రావడం చూసి వారు అవాక్కయ్యారు.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హమాలి కాలనీకి చెందిన మాడిశెట్టి సంపత్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. గత నెలలో వారు 117 యూనిట్ల విద్యుత్ వినియోగించారు. ఇందుకు గాను రూ.7,02,825 బిల్లు వచ్చింది. రేకుల ఇంటికి ఏడు లక్షల రూపాయల బిల్లు రావడం చూసి వారు అవాక్కయ్యారు.
ఇదేమిటని అడిగితే బిల్లు కలెక్టర్ సమాధానమివ్వకపోవడం గమనార్హం. ఏప్రిల్ వరకు నెలకు సగటున రూ.400 వరకు బిల్లు వచ్చేది. ఇదేంది సారూ.. ఎలా సరిదిద్దుతారు? అని అడిగేందుకు స్థానిక బిల్లు కలెక్టర్‌ను సంప్రదిస్తే సరైన సమాధానం ఇవ్వకుండా దాటేస్తున్నారని సంపత్ వాపోయారు. తప్పుల తడక బిల్లులతో హైరానా పెట్టడం సరికాదని అధికారులు బిల్లు సరిచేయాలని బాధితుడు కోరుతున్నాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
Anil Ravipudi: అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా..? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..